• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tholi Gayam

Tholi Gayam By Prerana Nunna

₹ 189

బస్ స్టాప్ పిల్లలంటే ఎంత ప్రేమో! వాళ్ళని స్కూల్ బస్ ఎక్కించి

అందరూ వెళ్ళిపోతారు. కానీ వాళ్లు మళ్ళీ తిరిగి స్కూల్ నుండి వచ్చే వరకు బస్ స్టాప్ మాత్రం అక్కడే ఒంటరిగా, వాళ్ళ కోసం ఎదురుచూస్తుంది. అది వాళ్లతో మాట్లాడటానికి ఏరోజూ ప్రయత్నించదు, కానీ వాళ్ల మాటలు మాత్రం ఎంతో ఓపికగా, ప్రేమగా వింటుంది. ఆ ముద్దుముద్దు మాటలకు, వాళ్లకి వినపడకుండా నవ్వుతుంది కూడా. పాపం... సాయంత్రం బస్ తిరిగి వచ్చాక అయినా వాళ్లతో కొంతసేపు గడపాలని, రోజంతా ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ పిల్లలు బస్ దిగాక, ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడనివ్వకుండా, చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోతారు. ఏదేమైనా, ఎన్నిసార్లైనా... మరో రోజుకోసం ఎదురు చూడటమే తనకి తెలిసిన ప్రేమ.

బస్ స్టాప్ ఎప్పటిలాగే, ఈరోజూ కూడా పిల్లల మాటలు వినాలని రోడ్ వైపు చూస్తూ ఎదురుచూస్తుంది. పిల్లల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు మాత్రం, బస్ వచ్చేవరకు పక్కవారితో తమ పిల్లలకు ఎంత విలాసవంతమైన జీవితం ఇస్తున్నామో అనే పోటీల్లో నిమగ్నమయ్యి, అప్పుడప్పుడు రోడ్ వైపు బస్ కోసం చూస్తున్నారు. అలా చూసినప్పుడే, రావలసిన సమయానికి బస్ రాలేదని చిరాకుపడుతూ, మళ్లీ తమ పోటీల్లో మునిగిపోతున్నారు.

ఒక్క బస్టాప్ మాత్రమే - సమయం ఎంతైనా పరవాలేదు, ఆ పిల్లల ముఖాల్లో సంతోషం చూడాలని ఎదురుచూస్తుంది. దూరం నుండి ఒక ఐస్క్రీం బండివాడు, తన జీవితాన్ని ముందుకు నెట్టడానికి కావలసిన బలాన్నంతటినీ ఉపయోగిస్తూ, ఆ ఐస్క్రీం బండిని ముందుకు నెట్టుకుంటూ వచ్చి బస్ స్టాప్ దగ్గర ఆపాడు. పిల్లలు అడిగితే వెంటనే ఇవ్వగలిగేటట్టు, అన్నీ సిద్ధం చేసుకుని బస్ కోసం రోడ్ వైపు చూస్తున్నాడు.................

  • Title :Tholi Gayam
  • Author :Prerana Nunna
  • Publisher :Prerana Nunna
  • ISBN :MANIMN6282
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :130
  • Language :Telugu
  • Availability :instock