• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vishwasinchaleni Viswasam Aathmadhrohamey

Vishwasinchaleni Viswasam Aathmadhrohamey By Dr Devaraj Maharaju

₹ 120

విశ్వసించలేని విశ్వాసం - ఆత్మద్రోహమే!

మనుషులను చంపే శక్తి మంత్రాలకు ఉంటే, దేశ రక్షణ కొరకు వేల కోట్ల రూపాయలు వెచ్చించి సైన్యాన్ని, ఆయుధాల్ని, ఫైటర్ విమానాల్ని సమకూర్చుకోవడం ఎందుకూ? మంత్రాలు చదివే వాళ్ళను ఓ నలుగుర్ని పంపితే పని అయిపోతుంది కదా? నలుగురు కాకపోతే నలభైమందో, నాలుగు వందల మందో - అయినా సరే మనకు వేల కోట్లు మిగులుతాయి. పైగా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. శ్రీ వేంకటేశ్వర సామ్రాజ్యమైన తిరుమల తిరుపతి నగరాన్ని ఆ మధ్య వరదలు ముంచెత్తడం విడ్డూరం! వాస్తు ప్రకారం కట్టిన ఇండ్లు కూడా వరసబెట్టి కూలిపోవడం విషాదం. ప్రభుత్వ యంత్రాంగం కదిలివెళ్ళి వరదల్ని అదుపు చేయడం, జనాన్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేయడం జరిగింది. మరి ఆ ఆపత్కాల బాంధవుడేడీ రాలేదేమీ? దేవుడి మహిమల గూర్చి పిచ్చి మాటలు కట్టి పెట్టి, నోరు మూసుకుని ఉంటే కనీసం వారి గౌరవం దక్కేది కదా? వాస్తు పండితులు, జ్యోతిషులు అంతా ఎక్కడికి పోయారూ? ఒక్కరూ నోరు మెదపలేదేమీ? రాగల ప్రమాదం గూర్చి ముందే చెప్పి, జనాన్ని అప్రమత్తం చేయలేదేమీ చెప్మా? వాతావరణ శాఖకు, ప్రభుత్వ యంత్రాంగానికీ పనిభారం తగ్గేది కదా? ఆ దేవదేవుడి మహత్యాన్ని ప్రదర్శనకు పెట్టాల్సింది కదా? ఆయనతో ఓ మాయాజాలం చేయించి ప్రాణ నష్టం, ఆస్థినష్టం జరగకుండా చూడాల్సింది!

వరదలప్పుడు భక్తులంతా "ఏడుకొండల వాడా! వెంకట రమణా!! గోవిందా గోవిందా అని ఎంత పిలిచినా ఆయనగారు రాలేదు. జనాన్ని కాపాడలేదు. "నన్నూ, ఆ భక్తుల్ని కాపాడే వారే లేరా?” అని ఏడుకొండల ఎంకట్రమణుడే వాపొయ్యాడుట! "భక్తులైనా, దేవుడైనా ఎవరూ భయపడాల్సిన పనిలేదు. వరదల్లోంచి మిమ్మల్ని రక్షించి బయటపడేయడానికి మేమున్నాం - అంటూ ఆర్మీ రంగప్రవేశం చేసింది. పోలీసు శాఖ నడుం బిగించింది. ఇంతకూ మనుషుల్ని మనుషులు రక్షించుకోవడమే గానీ, ఏదో శక్తి వచ్చి ఎవరినీ రక్షించింది లేదు. అసలు దేవుడి ఆభరణాలు దొంగలెత్తుకుపోతేనే ఆయనేం చేయలేక మిన్నకున్నాడు కదా? అంతా ప్రచారాల మహిమ. దేవుడి మహిమ కాదు. మహిమల ప్రచారం ఎంత ఎక్కువ జరిగితే అంత ఆదాయం ఉంటుంది. ప్రేయర్..............

  • Title :Vishwasinchaleni Viswasam Aathmadhrohamey
  • Author :Dr Devaraj Maharaju
  • Publisher :Nava Chetan Publishing House
  • ISBN :MANIMN4882
  • Binding :Papar Back
  • Published Date :July, 2023
  • Number Of Pages :116
  • Language :Telugu
  • Availability :instock