Logili Books

All

Vivaha Vedam

By Simha Prasad

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vivaha Vedam
Author
Publisher
Mohan Publications
ISBN
MANIMN4996
Binding
Papar back
Published Date
June, 2009 first print
Number Of Pages
243
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీకారం

పెళ్లి!

రెండక్షరాల ఈ మాట వింటే చాలు తలచుకుంటే చాలు కళ్ళముందు ఓ మనోజ్ఞ దృశ్యం ఆవిష్కృతమవుతుంది.

పచ్చని గడపలు, మామిడాకుల తోరణాలు, కళకళలాడే కళ్యాణ మండపాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, వధూవరులు సిగ్గులూ స్వప్నాలూ, పట్టుచీరల ఆర్భాటాలు, పిల్లల కేరింతలు, పెద్దల ఆశీస్సులు, షడ్రసోపేతమైన భోజనాలు!

భారతీయతకు అద్దం పడుతుంది పెళ్ళి!

హిందూ సంస్కృతికి నిలువెత్తు భాష్యం పెళ్లి కార్యక్రమం!!

పెళ్లంటే...

పెళ్లంటే మూడు ముళ్ళు. ఏడు అడుగులు. వెరసి నూరేళ్ళ జీవితం.

పెళ్లంటే ఒక వేడుక. ఒక ముచ్చట. ఒక ఆనందం. ఒక ఆర్భాటం. ఒక సంయోగం. ఒక సందేశం. ఒక అపూర్వ అనిర్వచనీయమైన అనుభూతి. జీవిత ధర్మాన్నీ లక్ష్యాన్నీ నిర్దేశించే మహత్తర ఘటన!

జీవకణానికి న్యూక్లియస్ ఎంత 'ప్రాణా'వసరమో జీవితానికి పెళ్లి అంతే.

జీవితానికి ప్రధానమైంది పెళ్లి. జీవితాన్ని మలుపు తిప్పేది పెళ్లి. జీవితానికి అర్ధం చెప్పేది పెళ్లి. జీవిత పరమార్థాన్ని వివరించేది పెళ్లి. జీవితానికి ధన్యత చేకూర్చేది

జననం నుంచి మరణం వరకూ సమస్తమూ పెళ్లితోనే ముడిపడ్డాయి. పెళ్లి చుట్టూనే తిరుగుతాయి!...............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?