• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Yuddam Inka Mugiyaledu

Yuddam Inka Mugiyaledu By Rajendra Prasad

₹ 250

వంశవృక్షం

ఒకప్పుడు ఒరిస్సాలో అపరిమితమైన ఖ్యాతి, కీర్తి, పలుకుబడి కలిగిన బాన్పూర్ రాజ కుటుంబం మాది. కేవలం శౌర్య ప్రతాపాలకే కాకుండా సాహితీ పిపాసకూ ఆ కుటుంబం పెట్టింది పేరుగా ఉండేది. కాలగతిని మార్చలేము కదా.. కాలంతో వచ్చిన మార్పులకు ఆ కుటుంబం లోనైంది. సంపద, ఖ్యాతి హరించుకుపోయాయి. పూరి గజపతి మహారాజు వద్ద అత్యంత శక్తిమంతమైన సైనిక అధికారులుగా పనిచేసిన శత్రుదుర్భేద్య భతపాడ గఢ్ అధిపతులు ఈ రాజ కుటుంబానికి చెందిన వారే. నా పూర్వీకులందరూ దేశం కోసం, దేశ గౌరవాన్ని పరిరక్షించడం కోసం పోరాడిన దేశభక్తులు, యోధులు. ప్రకృతి సౌందర్యాన్ని పుణికిపుచ్చుకున్న సోలారి కొండపై ఉన్న ఈ చారిత్రక దుర్గం గజపతి మహారాజు అధికారంలో అత్యంత శక్తిమంతమైనదిగా నిలిచింది. ఓ సైనిక అధినేత ఈ కోటకు రక్షకుడిగా ఉండేవాడు. పరిధిలోని పన్నెండు కోటలపై వీరి నియంత్రణ, అధికారం కొనసాగేది. మహారాజు, ఆయన సైనికాధిపతుల ఆదేశాల మేరకు ఈ కోట అధిపతులు సమరాంగణంలోకి దూకేవారన్నది చారిత్రక వాస్తవం. ఇందుకు సంబంధించి ఎన్నో కథలు వెలుగులోకి వచ్చాయి. కానీ అదంతా గత వైభవం.. మా వంశీకుల శౌర్య ప్రతాపాలకు సంబంధించిన కథలన్నీ చరిత్రలో కలిసిపోయాయి. కేవలం ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి.

ఈ విషయంలో ప్రధానంగా భతపాడ కోట అధిపతిగా పనిచేసిన దీనబంధు సమంతా రాయ్ వీరోచిత గాథలు చరిత్ర పుటల్లో ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా మా వంశీకుల గత వైభవానికి నిలువెత్తు నిదర్శనాలు. భతపాడ కోట అధిపతిగా..................

  • Title :Yuddam Inka Mugiyaledu
  • Author :Rajendra Prasad
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN4842
  • Binding :Papar back
  • Published Date :Oct, 2023
  • Number Of Pages :324
  • Language :Telugu
  • Availability :instock