• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Akshara Sastradhari Chakravartula Raghavachari Sampadakeeyalu 2nd Part

Akshara Sastradhari Chakravartula Raghavachari Sampadakeeyalu 2nd Part By R V Ramarao

₹ 200

విప్లవాంజలి

ఉత్తమ దేశభక్తుడు, భారత రైతాంగ నాయకుడు, మార్క్సిస్టు మేధావి కామ్రేడ్ భవానీసేన్ ఆకస్మిక మృతితో భారత కమ్యూనిస్టు ఉద్యమం ఒక అగ్రశ్రేణి నాయకుని కోల్పోయింది.

ప్రపంచ శ్రామిక వర్గ నాయకుడు కామ్రేడ్ డిమిట్రావ్ 90వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించటానికి భారత శ్రామిక వర్గ ప్రతినిధిగా కామ్రేడ్ భవానీ బల్గేరియా వెళ్ళి తిరిగివస్తూ మాస్కోలో మరణించారు. నిజమైన శ్రామికవర్గ అంతర్జాతీయ పోరాట వీరుడు కామ్రేడ్ భవానీసేన్.

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కర్కశ పాలనకు వ్యతిరేకంగా, జాతీయ స్వాతంత్ర్యానికై పిన్న వయస్సులోనే బెంగాల్ టెర్రరిస్టు ఉద్యమంలో పాల్గొన్న విప్లవకారుడు. నిజమైన జాతీయ స్వాతంత్ర్య సాధనకు దోపిడి రహిత సమాజ నిర్మాణానికి మార్గం మార్క్సిస్టు - లెనినిస్టు విప్లవ పంథా ఒక్కటేనని విశ్వసించి కమ్యూనిస్టు పార్టీలో చేరిన అనేకమంది విప్లవకారులలో కామ్రేడ్ భవానీ అగ్రగణ్యులు.

బెంగాల్లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించి, విస్తృత ప్రజాపునాదిగల పార్టీగా కమ్యూనిస్టు పార్టీని రూపొందించిన నిర్మాణదక్షుడు. భారత రైతాంగ ఉద్యమాన్ని ఉత్తేజ పరచిన చారిత్రాత్మక భాగా ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు.

మార్క్సిస్టు మహోపాధ్యాయుడుగా అనేక తరాల యువకులను ఉత్తమ శ్రేణి కమ్యూనిస్టు కార్యకర్తలుగా తయారు చేశారు.

ఆయన సునిశిత మేధాశక్తి, భావపుష్టి, విషయ స్పష్టత, సూటిదనం ఎంతటి వారికైనా..................

  • Title :Akshara Sastradhari Chakravartula Raghavachari Sampadakeeyalu 2nd Part
  • Author :R V Ramarao
  • Publisher :C Raghavachari Trust, Vijayawada
  • ISBN :MANIMN4834
  • Binding :Hard Binding
  • Published Date :May, 2022
  • Number Of Pages :294
  • Language :Telugu
  • Availability :instock