• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Aluperugani Poratam

Aluperugani Poratam By Bodapatla Ravindar

₹ 200

ఎదుర్కోవాల్సిందేనా?

విద్యార్థి సంఘానికి ఎన్నికైన కౌన్సిలర్ అశోక లతా జైన్ బహిష్కరణను నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఎస్ఐ) ఇచ్చిన సమ్మె పిలుపు రెండో రోజుకు చేరడంతో సెప్టెంబర్ 25, 1975 ఉదయం జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్ వాతావరణం మామూలు పరిస్థితికి భిన్నంగా ఉద్రిక్తంగా మారింది.

అప్పటికి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించి మూడు నెలలైంది.

ఆ రోజు ఉదయం స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ లాన్లలో నేను కొంతమంది ఎస్ఎఫ్ఎస్ఐ మిత్రులతో ఉన్నప్పుడు ఒక నల్ల రంగు అంబాసిడర్ కారులో నుండి ఒక దృఢమైన వ్యక్తి బయటకు దిగి, నా వద్దకు వచ్చి నాటి విద్యార్థి సంఘ అధ్యక్షుడైన డి.పి. త్రిపాఠీ నీవేనా అని అడగ్గా నేను కాదని సమాధానం ఇచ్చాను. అతను డిఐజి రేంజ్ పిఎస్ భిందర్ అనే పోలీసు అధికారి. నేను చెప్పింది విశ్వసించలేదు. మామూలు దుస్తుల్లో ఉన్న అతడు, అతని మనుషులు పట్టపగలే నన్ను కిడ్నాప్ చేసి చివరకు జైల్లో పెట్టారు. మీసా చట్టం కింద సంవత్సరం పాటు నిర్బంధంలో ఉంచారు.

ఐదు దశాబ్దాలు చాలా వేగంగా గడిచిపోయాయి. ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చింది. 2019లో కూడా వారే విజయం సాధించారు. మనం సొంత ఇంటిలా భావించే..............................

  • Title :Aluperugani Poratam
  • Author :Bodapatla Ravindar
  • Publisher :Nava Telangana Publishing House
  • ISBN :MANIMN5365
  • Binding :Papar Back
  • Published Date :March, 2024
  • Number Of Pages :192
  • Language :Telugu
  • Availability :instock