Logili Books

Novels

Anaganaga America

By Dr K Geeta Colums

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Anaganaga America
Publisher
Beet Root Book
ISBN
MANIMN6835
Binding
Paparback
Published Date
Dec, 2025
Number Of Pages
132
Language
Telugu
Availability
In Stock
About this book

అనగనగా అమెరికా-1
 

పిల్లల వీకెండ్

అనగనగా అమెరికా. అక్కడో కాలిఫోర్నియా రాష్ట్రం. (ఈ మధ్య కపిలారణ్యమని అందరూ కనిపెట్టేరు కదా అదన్నమాట). అది మామూలు అరణ్యం కాదు ధనారణ్యం. అందులో ప్రపంచాన్ని మార్చేసే ప్రోగ్రాములు నిమిషానికొకటి పుట్టి క్షణాల్లో జగమంతా వ్యాపింపజేసే జంతర్ మంతర్ లోయ ఒకటి. దాని పేరు సిలికాను లోయ. ఎక్కడ చూసినా భారతీయులు ఇబ్బడిముబ్బడిగా కనిపించే ఈ లోయలో దొరకని ఇండియన్ వస్తువులూ, తినుబండారాలూ ఉండవు. లేని దేవుడూ లేడు. వారమల్లా ఉద్యోగార్థమై పరుగులెట్టే పెద్దలు వారాంతాలలో పిల్లలతో బాటూ పరుగులెడతారు. పెద్దలు వీకెండ్, పిల్లల పాలిటి వీక్ ఎండ్. అలాంటి పరుగు పిల్లల్లో ఒక చిట్టి, ఒక చిన్ని చిట్టికి నాలుగేళ్లు, చిన్ని కి ఆరేళ్లు. చిన్నికి ఈ మధ్యనో పెద్ద బాధ పట్టుకుంది. ఎవ్వరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.”ఎప్పటికీ చిట్టి లాగా ఉండి పోతే ఎంత బావుణ్ణు" అనుకుంది. కళ్లు గట్టిగా మూసుకుని మనసులో అనుకుంది. “దేవుడూ! మొదట వీకెండ్ తీసెయ్యి. అంటే శనివారాలు, ఆదివారాలు రెండూ తీసెయ్యి.” రెంటినీ బేరీజు వేసుకుని మళ్లీ ఇలా అంది. "శనివారాలు మొదట తీసెయ్యి. ఎందుకంటే శనివారం ఉదయానే మామూలు కంటే బాగా పొద్దున్నే లేవాలి. తల స్నానం చేసి అమ్మా, నాన్నా వేంకటేశ్వర పూజ చేస్తుంటే నేనూ, చెల్లీ కదలకుండా కూర్చోవాలి. మధ్యలో అమ్మ చెప్పినట్లు దణ్ణాలు పెట్టడం, నాన్న చెప్పినట్లు గంట వాయించడం. ఇంకా పెద్ద బాధ కాసిన్ని పాలూ, కార్న్ ఫ్లేక్సు గబగబా మింగి ఇండియన్ బట్టలేసుకుని ఉదయానే భాషా బడికి వెళ్లడం. అక్కడ వారమల్లా మాట్లాడే ఇంగ్లీషు భాష కాకుండా ఇండియాలో అమ్మా, నాన్నా మాట్లాడే భాష నేర్చుకోవాలి. వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు కారులో భక్తి పాటలో, భగవద్గీత శ్లోకాలో వినాలి. విని విని నోటికి వచ్చిన వాటిని తిరిగి వినిపించాలి. ఇంటికొచ్చి.......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?