అనగనగా ఓ నాన్న
I am, because you are -African Proverb
మానవ శరీరం
* మీ భోజనం మీ నోట్లోంచి మీ కడుపులోకి వెళ్ళడానికి ఏడు క్షణాలు పడుతుంది.
* ఓ మనిషి వెంట్రుక మూడు కిలోల బరువుని మోయగలదు.
* మనిషి తొడ ఎముకలు కాంక్రీట్ కన్నా బలమైనవి.
* మగవాడి గుండెకన్నా స్త్రీ గుండె వేగంగా కొట్టుకుంటుంది.
* ప్రతి మనిషి పాదంలో కనీసం కోటి బాక్టీరియాలు ఉంటాయి.
* లాలాజలంలో కరగని పదార్థం తాలూకు రుచిని నాలుక గ్రహించలేదు.
* సగటు మగవాడి పురుషాంగం అతని బొటనవేలుకి మూడు రెట్లు ఉంటుంది.
* దీన్ని చదివే ఆడవారు ఇంతటితో దీన్ని ముగిస్తారు.
* దీన్ని చదివే మగాళ్ళు ఈ పాటికి తమ బొటనవేలి కొలతని చూసుకుని ఉంటారు.
ఫక్కున నవ్వి త్రివిక్రం ఆ వివరాలు ఇచ్చిన అమెరికానించి వచ్చే ఆ మెడికల్ జర్నల్ 'జమని పక్కన పడేసాడు. 1883నించి ఏడాదికి నలభై ఎనిమిదిసార్లు ప్రచురించబడుతున్న జమ ఫుల్ ఫాం 'ది జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్.” ప్రపంచంలో అత్యధికంగా సర్క్యులేట్ అయ్యే మెడికల్ జర్నల్ అది.
అప్పటికే టేబుల్మీది ల్యాండ్ లైన్ మూడుసార్లు మోగినా, జమలో, హ్యూమర్ సెక్షన్ లోని ఆ మెడికల్ బిట్స్ చదవడంలోని ఆసక్తితో త్రివిక్రం రిసీవర్ని వెంటనే ఎత్తలేదు.......................