• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Anuvu Anuvuna

Anuvu Anuvuna By Chandra Shekhar Shista

₹ 125

అక్షరజ్యోతిని వెలిగించు ..'

భారతదేశం వేదాలకు పుట్టినిల్లు.సకల శాస్త్రాలూ వేదాలనుండే పుట్టాయని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. ప్రపంచ చరిత్రలో వేదకాలం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందరో మహర్షులు వేద విజ్ఞానాన్ని తపస్సు చేసి సంపాదించి, వాటిలోని రహస్యాలను సామన్య ప్రజలకు అందజేశారు. అయితే ఆ కాలంలో ప్రజలను పరిపాలించేవారు రాజులు కాబట్టి మహర్షులు ఆ విజ్ఞానాన్ని రాజులకు అందజేసి, ధర్మాన్ని బోధించి ప్రజలను సుఖంగా జీవించేలా చేసేవారు. అందుకుగాను రాజపుత్రులను చిన్నతనంలోనే గురుకులానికి పంపి అక్కడ ఆశ్రమ నియమాలను పాటించేలా చేసి వారికి ఆ తర్వాత విద్యాబుద్ధులు నేర్పించేవారు. 'యుక్తవయసు రాగానే వారిని ఆ దేశపు రాజుకు అప్పగించి పట్టాభిషేకం జరిపించేవారు. అలా నియమాలతో నేర్చుకున్న విద్యతో రాజకుమారులు ప్రజలకు న్యాయం జరిగేలా చూసేవారు. అయితే అప్పట్లో ఈ విద్యలు కేవలం రాజకుమారులు మరియు గురుపుత్రులు అభ్యసించే వారు. తర్వాతి కాలంలో

బ్రాహ్మణులు వేద విద్యను వారి కులంలోని మగపిల్లలకు మాత్రమే బోధించే వారు. ఈ విద్యను అభ్యసించాలి అంటే ఆ పిల్లలకు ఉపనయనం జరిగి తీరాలి. ఈ ఆచారం కేవలం ఒక కులానికి చెందినది కనుక ఈ విద్యా పద్ధతిని వారికి కేటాయించిన అగ్రహారాల్లో అమలు చేసేవారు. ఇందులో భాగంగా సంస్కృతంలో వాడుకున్న శ్లోకాలను వల్లె వేసే పద్ధతిలో నేర్పించేవారు. వాటిని కొందరు ఘనము' లక ఘనాపాఠము అనేవారు. ఘనము అంటే గొప్పదని అర్ధం. రాజంకాలు తరించాకా మనల్ని బ్రిటీష్ వారు పరిపాలించేవారు. అప్పట్లో వృత్తి విద్యా..........

  • Title :Anuvu Anuvuna
  • Author :Chandra Shekhar Shista
  • Publisher :Sarvahtrah Foundations
  • ISBN :MANIMN3340
  • Binding :Papar Back
  • Published Date :May, 2022
  • Number Of Pages :144
  • Language :Telugu
  • Availability :instock