|
పూర్ణ చంద్రోదయం ఎండి శుష్కించిన నేలను ఎట్టకేలకు తొలకరి వానలు కరుణించాయి. గాలివాటం మారింది. వర్షాకాలం మొదలైపోయింది. మూడు రోజులుగా ముసురు. నేడు సముద్రం వైపునుండి గాలి ఉధృతంగా వీస్తోంది. అయినా ఉక్కపోత. కళింగపట్నం మీదుగా అగ్రహారంవైపు వెళ్లే దారంతటా బురద. అప్పటివరకూ ఉండీ ఉడిగీ కురిసిన వానలకే రహదారులన్నీ బురదనీటి గుంటలుగా మారిపోయాయి. వేద పాఠశాల విద్యార్థులకు పరీక్ష నిర్వహించడానికని పొరుగూరు వెళ్లిన విశ్వనాథశర్మ, ఒంటెద్దు గూడుబండి మీద ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆనాడు అతని ఆలోచనలన్నీ ఒక్కగానొక్క కొడుకు అనంతకృష్ణుడి చుట్టూనే తిరుగాడుతున్నాయి. ముసురు పట్టినా, గాలీవానా వచ్చినా కొడుకు ఎలా ఉన్నాడో అనే ప్రశ్న అతన్ని వేధిస్తూంటుంది. పంతులుగారికి ఇబ్బంది కలగకూడదని బండివాడు ఎద్దును అదిలిస్తూ నెమ్మదిగానే పోనిస్తున్నాడు; మరో ప్రక్క బండి చక్రాలు ఏ బురదగుంటలోనో ఇరుక్కుపోతాయేమోననే చింత, శర్మ ఇవేమీ పట్టించుకొనే స్థితిలో లేడు. బండి ఊగిసలాడుతూ అగ్రహారంలోకి ప్రవేశించింది. ఎదురుపడ్డ పెద్దాచిన్నా అతనికి దండం పెట్టి ప్రక్కకు తప్పుకుంటున్నారు. మధ్యాహ్న భోజనాలు కానిచ్చి, పెంకుటిండ్ల ఎత్తరుగుల వరండాలలో సేద తీరుతూ విసనకర్రలతో విసురుకుంటూనో, లేక వాటి కాడలతో పేతపట్టిన తమ వీపుల్ని........................ అరకప్పు అల్లం టీ : 7 |