Logili Books

Short Stories

Armenian Kathalu

By Prakruthi Vasireddy

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Armenian Kathalu
Publisher
Anil Battula Pubications
ISBN
MANIMN7008
Binding
Paparback
Published Date
June, 2026
Number Of Pages
162
Language
Telugu
Availability
In Stock
About this book

మా మీది నుండి స్వాలో పక్షులు ఎగిరాయి

అతను మళ్లీ వెళ్లిపోయాడు. తను ఇంట్లో లేడంటే, తన పడవలో బయటకు వెళ్లాడని అర్థం. అతనుండేది మెత్తటి పరుపు, తన భార్య తన కోసం వేచిచూస్తూ, తాను కోరిన ప్రతిదీ దొరికే ఆ ఇంట్లోనా; లేక ఆ పడవలోనా; అనేది చెప్పడం కష్టమే.

“పోనీ ఎప్పుడొస్తాడో చెప్పలేదా?” అని అడిగాను.

ఆమె భర్త గురించిన ప్రతి విషయంపై ఆమెకున్న వ్యతిరేకత తెలిసేలా, చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత పొగరుగా, బాధగా, “తెలీదు. నాకేమీ తెలీదు. పిచ్చోడికి రోజుల లెక్కేముంటుంది? వెళ్లి మూడు రోజులైంది” అంది.

“సూలా ఏమైంది?”

“తెలీదు... నా పిల్ల ఎక్కడుందో ఏంటో” ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.

“సరే వస్తాను, అనస్తాసియా” అని చెప్పి వీధిలోకి పరుగు తీశాను. అక్కడి నుండి కొండచరియల దిక్కుకి వెళ్లబోయి, సముద్రతీరం దగ్గరే అలుపొచ్చి ఆగిపోయాను. అరిగిపోయిన పాత చెప్పులతో, గులకరాళ్ల మీద పరిగెత్తేసరికి పాదాలు నొప్పెట్టాయి.

ఆకాశం నీలిరంగులో మెరిసిపోతోంది. సముద్రం కూడా తేటగా, నిశ్చలంగా ఉంది. గొంతు చించుకుని అరవాలనే పిచ్చి కోరిక పుట్టింది........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?