₹ 250
సౌకుమార్యం , సౌందర్యం, సౌగంధ్యo - ఈ మూడు కలిసివున్న పూలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ మూడు భువన చంద్ర చలన చిత్ర సాహిత్యవనంలో విరిసిన పాటల్ని వరించటం విశేషం. సుతిమెత్తని పదాలతో సుందరంగా పాటను అల్లటం - ఆ పాటకు భావపరిమళంతో ఉపిరిపోయటం ఈ మెళకువలన్నీ భువనచంద్రకు క్షుణ్ణంగా తెలుసు. అంతేకాదు, సంగీతం, సాహిత్యం, నాట్యం, ఇవి కూడా భువనచంద్ర చలచిత్రగీతాల్లో త్రివేణీసంగమమై గోచరిస్తుంటాయి.
"నాకు పెళ్ళాం కావాలి" చిత్రంలో చెలరేగిన భువనచంద్ర లెక్కకు మించిన పాటలు రాసారు. రెండవ సినిమాకే సింగల్ కార్డ్ రైటర్ గా సింహాసనం మీద కూర్చున్నారు. ఎంతో ప్రతిభ పండితే తప్ప మొత్తం పాటలన్ని ఒకే రచయితతో రాయించే సందర్భాలుండవు. అయితే భువనచంద్ర వేసిన రెండో అడుగులోనే తన బలమేమిటో నిరూపించుకున్నారు.
- Title :Bhuvanachandra Sinigeya Sahityam
- Author :Dr Gummadi Ramalakshmi
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN0892
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :366
- Language :Telugu
- Availability :instock