• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Asakati Abhiruchi Vyasalu ( Asakthi)

Asakati Abhiruchi Vyasalu ( Asakthi) By Mukunda Ramarao

₹ 300

స్త్రీ ఆత్మ ప్రకటన - ముద్దుపళని

1739 నుంచి 1763 వరకు తంజావూరును పాలించిన ప్రతాపసింహుడు. ఆస్థానంలో కొలువు చేసిన రాజనర్తకి ముద్దుపళని. ఆస్థాన కవయిత్రి కూడా. ఆ రాజు ప్రాజ్ఞుడు. కవి పండిత పోషకుడు, సంగీత కళాభిమాని. ముద్దుపళనిని ఆదరించాడు. దేవదాసి కుటుంబంలో పుట్టిన ముద్దుపళని తల్లి పోటీబోటి, నాయనమ్మ తంజనాయకి ఇద్దరూ కూడా కవయిత్రులే. తండ్రి పేరు ముత్యాలు. సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం పేరు 'పళని. ముద్దుగా ఉన్న బిడ్డకు ఆ పుణ్యక్షేత్రం పేరు జోడించి 'ముద్దుపళని’ అని పేరుపెట్టారు. ముద్దుపళని గురువు వీరరాఘవదేశికుడు. తాను నాట్యకత్తెననీ, శరీర కాంతిలో రత్నం వంటిదానిననీ, లలిత సకల కళా ప్రౌఢితో వెలసినట్లు, పండితులకు సన్మానాలు చేసినట్లుగా కూడా ఆమె చెప్పుకుంది. దక్షిణాంధ్ర యుగపు తంజావూరు, తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని వాద వివాదాలకు గురైన ఆమె కావ్యం పేరు 'రాధికా సాంత్వనము'. ఈ శృంగార ప్రబంధం, ఆనాటి దక్షిణ దేశపు శృంగార కావ్యాల కోవకు చెందింది. స్త్రీ అంతరంగాన్ని స్త్రీల భావనలను ఆవిష్కరించిన కావ్యం ఇది.

చిన్ని కృష్ణుడు తన కలలో కనిపించి తనకు అంకితంగా ఓ కావ్యాన్ని రాయమని అడిగినట్లు ముద్దుపళని 'రాధికా సాంత్వనము' అవతారికలో చెప్పుకుంది. తన గురువు, ఇతర పండితులకు తన స్వప్నాన్ని చెప్పుకొని, వాళ్ల అనుమతితో 'రాధికా సాంత్వనము' రచన ప్రారంభించింది. ఈ కావ్యానికి "ఇళా దేవీయము" అని మరోపేరు కూడా ఉంది. 584 పద్య గద్యాలతో ఉన్న నాలుగు ఆశ్వాసాల ఈ శృంగార కావ్యాన్ని శుక మహర్షి ముఖతా జనకునికి చెప్పించింది. గొప్ప సంగీత,................

  • Title :Asakati Abhiruchi Vyasalu ( Asakthi)
  • Author :Mukunda Ramarao
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6063
  • Binding :Papar back
  • Published Date :Oct, 2024
  • Number Of Pages :347
  • Language :Telugu
  • Availability :instock