• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Cherigipothunna Chivari Sarihaddulu

Cherigipothunna Chivari Sarihaddulu By Arati Kumar Rao

₹ 325

బెంగుళూరు

జులై 2007

బయట ఆగకుండా తీవ్రమైన వర్షం సుత్తిదెబ్బలు కొడుతోంది. నేను దుప్పటికింద ముసుగు తన్ని పడుకున్నాను. రవ్వంత కూడా తగ్గకుండా జ్వరం పట్టుకుని వదలడం లేదు.

మధ్యాన్నం 2.30 గంటలకి ధర్మామీటరు 104° F చూపిస్తూండగా చైనా నుంచి వచ్చిన కాల్ చూసుకుని, నా ప్రజెంటేషన్ పంపించి మరో గంటవరకూ మత్తులో ఉండిపోయాను. అలిసిపోయి, ఒణుకుతూ నా గదిలోంచి నన్నే ఈడ్చుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళి పేరాసిటమాల్ బిళ్ళ మింగి శూన్యంలో పడిపోయాను.

లేచేసరికి రాత్రి అయింది. జ్వరం ఇంకో మెట్టు ఎక్కువై 105° కి చేరింది.

చాలా రోజులు రక్తపరీక్షలు, ఆస్పత్రికి వెళ్ళడాలు అయిన తరువాత నాకు పారా టైఫాయిడ్ అని తెలుసుకున్నాను. నాకు యాంటీబయాటిక్స్ పడవు. నేను కోలుకోవటం అనేది నిదానమైన అతి ఇబ్బందికరమైన ప్రక్రియ. నేను పనిచేసే బహుళజాతి సంస్థకి శలవు పెట్టేను. నేను మార్కెట్ రీసెర్చర్ని. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సాంకేతిక వినియోగం గురించి, దాని ప్రభావం మార్కెటింగ్ వ్యూహంమీద ఎలా ఉంటుందో అధ్యయనం చేయడం నా పని.

ఒక అపస్మారక స్థితిలో రోజులు గడిచేయి. గాజు కిటికీలని తడుతూ వర్షం నా దుస్థితికి వాద్య సహకారం అందిస్తోంది. అమ్మ నాకు రక్షణ దేవతగా, సంరక్షకురాలిగా, క్రమశిక్షకురాలిగా వచ్చి ఉండిపోయింది. ఆరోగ్యకరమైన.......................

  • Title :Cherigipothunna Chivari Sarihaddulu
  • Author :Arati Kumar Rao
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN6738
  • Binding :Papar back
  • Published Date :Dec, 2025
  • Number Of Pages :245
  • Language :Telugu
  • Availability :instock