• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chikati Puvvu

Chikati Puvvu By Kathi Padma

₹ 250

ఎన్నో అమావాస్యలు-కొన్ని పున్నములు జి.ఎస్. రామ్మోహన్

పద్మ కథలు ప్రశ్నిస్తాయి. ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేస్తాయి. కానీ

ముందస్తుగా ఏర్పరుచుకున్న మూసల్లోంచి పడికట్టు పరిష్కారాలివ్వవు. కథ కావడం కోసం, జీవితాన్ని వ్యాఖ్యానించడం కోసం చేసిన కల్పనలుండొచ్చు. ఉండాలి. కానీ అభూత కల్పనల్లేవు. పాత్రలకు మన ఆకాంక్షలను అద్ది వాటిని తూర్పు దిక్కువైపు లేచే పిడికిళ్లుగా మార్చే కృతకత్వానికి పాల్పడలేదు. నిరంతరం మారుతున్న ప్రపంచంలో రెడీమేడ్ పరిష్కారాలకు ఉన్న పరిమితి తెలియడం వల్ల కనిపించే పరిణితి.

పెంపుడు జంతువులతో గోడు వెళ్లబోసుకుంటూ వాటితో బంధం పెనవేసుకునే వారిలో ఆడవాళ్లే ఎందుకు ఎక్కువగా కనిపిస్తారు?

పూనకాలు ఆడవాళ్లకే, దెయ్యం పట్టడాలు ఆడవాళ్లకే, చివరకు దెయ్యాలు కూడా

ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు పద్మ.

స్త్రీలు పుట్టరు తయారు చేయబడతారు అనే అనే సిమోన్ ది బొవియర్ మాటను పదే పదే చెప్పుకుంటాం కదా! ఇంతకీ ఎలా తయారుచేయబడతారు అనేది విప్పి చెప్పే ప్రయత్నం చేశారు పద్మ.

మొగుడు పోయాక మాత్రమే ఊపిరి పీల్చుకోగలిగిన నూకాలమ్మ, పిల్లులు, కుక్కలు, గేదెలు అన్నింటితో అదేపనిగా మాట్లాడుతూ వాటితో జీవితం పెనవేసుకున్న నూకాలమ్మ, చివరకు పాముకు కూడా చిరాయువు ఇవ్వమని సూర్నాయన్ని కోరుకునే నూకాలమ్మ నిజంగా ఇసాకపట్నం కొండ. భౌతిక అంశాలతో పాటు మానసిక విశ్లేషణకు స్కోప్ ఉన్న కథ ఇది. మనుషులతో రోసిపోయిన ఎర్రెమ్మ,..................

  • Title :Chikati Puvvu
  • Author :Kathi Padma
  • Publisher :Mitra Sahity Vishakapatnam
  • ISBN :MANIMN4113
  • Binding :Papar back
  • Published Date :Feb, 2023
  • Number Of Pages :308
  • Language :Telugu
  • Availability :instock