• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Dikchakram

Dikchakram By Adepu Lakshmipati

₹ 300

'మూల మలుపు'లో కవిత్వం - ఒక పరామర్శ

ఈ ప్రపంచంలో ఏదీ స్థిరంగా వుండదు. ప్రతీదీ తన స్థితి, స్థాయి, దశ, రూపం విషయంగా నిత్యం పరిణామం చెందుతూనే వుంటుందన్న సత్యాన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రేమ తత్త్వవేత్త హెరాక్లిటస్ ఒక్కమాటలో - Changs is only the comment చెప్పాడు. నిట్టనిలువు Great chain of Beingలో ప్రతివానికి పూర్త సహజస్థానం వుంటుందనే మధ్యయుగాల ప్రాచీన భావన క్రమంగా పక్షమునును చరిత్ర పురోగతి, మానవజాతి పరిణామం, నూతన ఆవిపుణల ్బందులు, కొత్త శాస్త్రీయ ఆలోచనల వికాసం... తదితర అంశాల క్షితిజ సమాంతర కాంక్రీటు దానిపై మానవ సమాజ ప్రస్థానం సాగుతూ వస్తున్న క్రమంలో ఆధునిక అత్యాధునిక యుగాలు దాటేసి, సాంకేతిక విజ్ఞానాన్ని సర్వత్రా వ్యాపింపజేసిన ప్రపంచీకరణ ప్రభావంతో అన్ని రంగాల్లో Paradigm shift చోటుచేసుకున్నది. అంతటా సరికొత్త ప్రాపంచిక దృక్పథం, జీవన దార్శనికత నెలకొనివున్న డిజిటల్ యుగంలో మనం ఇప్పుడు కున్నాం. చరిత్ర పునరావృత్తం కాదు, అది వర్తులాకారంగా నడవదు. అది ఎప్పుడూ - అప్పుడప్పుడు వంకర టింకరగా నడిచినా.. రేఖీయ మార్గాన్నే ముందుకు సాగుతుంది. సమాజం ఇవాళ ఉన్నట్టుగా రేపు వుండదు. మనుషులు, వాళ్ల ఆలోచనలు మారినకొలదీ సమాజం మారుతూ పోతుంది. వస్తూత్పాదనా పద్ధతులు, ఆర్థిక సంబంధాలు చోదక శక్తులుగా వుంటూ dynamics of social and political change కారణమవుతాయి.

అయితే మనిషి మార్పును వెంటనే అంగీకరించదు. ఒక నిర్ణీత కాలవ్యవధిలో, అనగా ఒక దశాబ్దం లేదా ఒక తరం లేదా ఒక శతాబ్దం పాటు నిర్దిష్టమైన జీవనవిధానానికి. స్థిరమైన సామాజిక సంబంధాలకు, భౌగోళిక పరిసరాలకు అలవాటుపడ్డ మనిషి సహజంగానే మార్పును ఆసక్తిగా చూస్తాడు. మార్పు తన జీవితంపై కలిగించే ప్రభావాన్ని బట్టి మనిషి పలు విధాలుగా స్పందించే అవకాశముంది. అది బతుకును మెరుగు పరివేదయితే సంతోషిస్తాడు, నష్టపరిచేదయితే భయపడతాడు. తక్షణ ప్రభావాన్ని చూపయితే అనుమానపడతాడు. మార్పు తన జీవనభద్రతకు తీవ్ర విఘాతం కలిగించేదిగా తోస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. వ్యవస్థతో సంఘర్శిస్తాడు. ఆ మార్పును నిరోధించడం తన శక్తికి మించిన పని అనుకుంటే రాజీధోరణి అవలంబిస్తాడు. లోలోను బాధపడతాడు...................

  • Title :Dikchakram
  • Author :Adepu Lakshmipati
  • Publisher :Aditya (Litarari) Publications
  • ISBN :MANIMN4622
  • Binding :Paerback
  • Published Date :Feb, 2022
  • Number Of Pages :416
  • Language :Telugu
  • Availability :instock