• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Dollar. . . . . . . . . . . Dollar. . . . . . . . . .

Dollar. . . . . . . . . . . Dollar. . . . . . . . . . By Simha Prasad

₹ 80

డాలర్...! డాలర్...!

            ఆకాశంలోని ఎరుపురంగు మెల్లమెల్లగా పడమటికొండల వెనక్కి జారుతోంది.

            ఆనందాశ్వాన్ని అధిరోహించి ఇంటికొచ్చాడు ముకుందం.

            అతడికి చెప్పలేనంత సంబరంగా, గొప్ప పెన్నిధి లభ్యమైనట్టుగా వుంది.

            యౌవనపు తొలిసంధ్యలో వున్నాడతడి కొడుకు.

            చాలారోజులుగా కొడుక్కి తన కాంక్షల్నీ, స్వప్నాల్నీ విశదీకరించాలను కుంటున్నాడు. కాని అక్షరీకరించడమెలాగో తెలీటంలేదు. బాబుకి అర్థమయ్యేట్లు ఎలా విప్పి చెప్పాలో, మరెలా ఆవిష్కరించాలో తోచక ఇన్నాళ్ళూ సతమతమవుతున్నాడు.

            అలాటిదివాళ అనుకోకుండా నెరవేరింది. ఒక ఫ్రెండ్ వెంట పోస్టర్ల షాపుకి వెళ్ళాడు.

            అక్కడి ఒక చిత్రం అతడ్ని చాగా ఆకర్షించింది.

            తన ఆశలకి, ఆకాంక్షలకి రంగూ, రుచీ వాసనలిచ్చి రూపం ఏర్పడి జీవం పోసుకున్నట్టుగా వుంది.

            దాన్ని కొని తెచ్చేశాడు.

            "దొరబాబూ..."

            ఇంట్లో అడుగు పెడుతూనే పిలిచాడు ముకుందం. అతడి గొంతులో చిత్రమైన ఆనందరాగాలు పలికాయి.

            "ఏం డాడీ?".................

  • Title :Dollar. . . . . . . . . . . Dollar. . . . . . . . . .
  • Author :Simha Prasad
  • Publisher :Sri Sri Prachuranalu
  • ISBN :MANIMN4880
  • Binding :Papar back
  • Published Date :Nov, 2010
  • Number Of Pages :156
  • Language :Telugu
  • Availability :instock