Logili Books

History

Dravida ( Vivakshapai Dakshina Swaram)

By K N Malliswari

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Dravida ( Vivakshapai Dakshina Swaram)
Publisher
Malupu Books
ISBN
MANIMN7172
Binding
Paparback
Published Date
July, 2026
Number Of Pages
127
Language
Telugu
Availability
In Stock
About this book

ద్రవిడవాద పరిశోధన

పదిహేడేళ్ల ప్రరవే - 2026 ఫిబ్రవరి 7, 8 తేదీలలో కర్నూలులో ఎనిమిదవ మహాసభలు జరుపుకున్నది. ఆ మహాసభల అంశం 'ద్రావిడ సమాజ సాహిత్యాలు' (సారూప్యత - ఐక్యత - పోరాటం). దాదాపు ఏడాది కిందట ఈ అంశం నిర్ణయించు కున్నపుడు ద్రవిడవాదం మీద కొన్ని రచనలు, వ్యక్తిగత వ్యాసాలు తప్ప వర్తమాన సామూహిక చర్చ చాలా తక్కువగా ఉంది. దక్షిణ భారత సమాజాలను వందేళ్ళ పైబడి ప్రభావితం చేస్తూ వచ్చిన అంశం వర్తమానంలో మరింత ముందుకు వెళ్లాలని కోరుకోవడంలో ప్రరవేకి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి.

ద్రావిడ సమాజాలు అనేమాట భాషాపరంగా 1816 నుండి చర్చలోకి వచ్చింది. కాంప్బెల్ వ్రాసిన తెలుగు గ్రామర్ పుస్తకానికి ఫ్రాన్సిస్ వైట్ ఎలిస్ Note to the intro duction అనే పేరుతో వ్రాసిన ముందుమాటలో తమిళ, తెలుగు, కన్నడ భాషలు- సంస్కృతానికి అవతల వేరే భాషాకుటుంబానికి సంబంధించినవని చెప్తూ ద్రావిడ భాషా కుటుంబ భావనకు బీజం వేసాడు. రాబర్ట్ కాడ్వెల్ ఈ భావనను విస్తరించి స్థిరపరిచాడు. భాషాచరిత్ర పరిశోధనల వల్ల సంస్కృతంతో ద్రావిడభాషలకు జన్యుసంబంధం ఏదీ లేదని నిర్ధారణ అయింది. అవి ఇండో ఆర్యన్ భాషలకంటే పూర్వపువి అని నిరూపణ అయింది. 220 మిలియన్ల జనం ఈ భాషలను మాట్లాడతారని ఈ భాషలు నాలుగువేల అయిదువందల సంవత్సరాల చరిత్ర కలిగినవని తెలుస్తున్నది.

భాషాపరమైన ద్రవిడపదం తమిళనాట 20వ శతాబ్ది ప్రారంభంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థకు బ్రాహ్మణాధిక్యతకు, ఉత్తర భారత ఆధిక్యతకు వ్యతిరేకంగా భాషాసాంస్కృతిక అస్తిత్వ ఆకాంక్షలను, ఆత్మగౌరవ ఆరాటాలను, సమానత్వం, సామాజికన్యాయం వంటి ప్రజాస్వామిక విలువలను ముందుకు తెచ్చిన ఉద్యమానికి పేరైంది. మొత్తానికి ఇప్పుడు ద్రవిడపదం భౌతిక ప్రభావాలను, అధికారాలను ప్రతిఘటించే అర్ధవిస్తృతిని పొందింది. చరిత్రకి కొనసాగింపు- వర్తమాన ఫాసిస్ట్ సందర్భాన్ని ఎదుర్కోగల నైతికధైర్యం. లౌకిక ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రోది చేసుకొనటం............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?