• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Inthiyanam 2 O

Inthiyanam 2 O By Swarna Kilari

₹ 350

ప్రకృతి ఒడిలోకి
 

-అంజలి

అమ్మ కడుపునుంచి మొదలై భూమాత కడుపున చేరే వరకూ నిత్యం ప్రయాణమే కదా, ఈ భూమికూడా రోజూ క్షణమైనా ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది.

ఎప్పుడైనా నాకు నాన్న ఊరికి, నాన్నతో వెళ్ళిన జ్ఞాపకమంటే చాలా ఇష్టం. అది చాలా అద్భుతంగా ఉండేది. నాన్న ఉద్యోగరీత్యా మేమున్న ఊరు ఏజెన్సీ లాంటిది, చుట్టుపక్కల ఊళ్ళలో పెద్దది. 'గోపాలపురం' ఊరు నాన్నకి ఎంత ఇష్టమో. అందమైన బాల్యాన్ని ఇచ్చిన ఆ ఊరంటే నాకూ అంతే ఇష్టం. అక్కడ పూచికపుల్ల లేకున్నా అది నా పుట్టిల్లు, అక్కడ అందరూ నా తోబుట్టువులే. నా స్కూల్, నా స్నేహితుల సంబరం. అక్కడ వారపు సంత ఎంత పెద్దదో. రత్తమ్మని తోడిచ్చి ఎనిమిదేళ్ళ వయసులోనే సంతకి పంపేది మా అమ్మ . ఐదు రూపాయలకే చాలా వచ్చేవి. అదొక స్వర్గమే.

మా ఊరు పోవడానికి రెండు బస్సులు ఉండేవి. ఒకటి పంగిడి చాగల్లు మీదుగా, ఇది దగ్గర దారి. ఇంకోటి పల్లంట, కోరుమామిడి, వాదాలకుంట మీదుగా. డొంకతిరుగుడు బస్ అనేవాళ్ళం. అది ఎక్కేవాళ్ళం కాదు. ఆ రోడ్ అంతా ఎర్రటి కంకర. చుట్టూ జీడిమామిడి తోటలు. కొన్నిసార్లు ఆ తుప్పల్లోంచి కుందేళ్ళ పరుగులు కనిపించేవి. పాములు కూడా కనపడి భయం పుట్టించేవి. ఆ మార్గంలో బస్లో వెళ్లినా కూడా మనుషులం ఎర్రటి మట్టిపట్టినట్టైపోయేవాళ్ళం. చిన్నప్పుడు ఆ దారిలో వెళ్తే అడవిమార్గాన పోయినట్టు ఉండేది. అందుకని పంగిడీ చాగల్లు బస్సే.........................

  • Title :Inthiyanam 2 O
  • Author :Swarna Kilari
  • Publisher :Arnavam Publicatations
  • ISBN :MANIMN6229
  • Binding :Papar Back
  • Published Date :May, 2025
  • Number Of Pages :337
  • Language :Telugu
  • Availability :instock