ఆరంజ్యోతి మాకు కనపడే ఆర్నెల్ల అప్పుతో! "మా.. నా పెండ్లికి నేను కోరుకునే మూడు మంచి చీరలు కావల్ల, తొలి నలుగు పెట్టేటప్పుడు సీత సమేత రామ సీరియల్లో హీరోయిన్ కట్టుకునిందే అట్లాంటి కలర్ అదే డిజైన్ చీర కావల్ల, ఆ సీరియల్లో మారిగా నలుగు పెట్టేటప్పుడు పసుపు నీళ్లు చల్లల్ల . నా పెళ్లి వీడియోలో అవన్నీ ఉండల్ల. ఒక డిజైన్ జాకెట్కి మూడు వేలంట. నాకు మూడు జాకెట్లు కుట్టించు. ముహూర్తానికి వరుడు కావలెను సినిమాలో హీరోయిన్ కట్టుకొని ఉంటుందే ఎర్రంచు పట్టు చీర, దానికి తగ్గ నగలు కావల్ల. అదే నగల సెట్టింగ్ ఉమాగోల్డ్ దొరుకుతాయంట. వాటికి దగ్గ మ్యాచింగ్ గాజులు, బొట్టు బిళ్ళలు, స్మూత్ హీల్స్ కూడా కావల్ల. పూలమాలలు.................. |