Logili Books

Novels

Kaalindi

By Maddipatla Suri

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kaalindi
Publisher
Classic Books
ISBN
MANIMN7080
Binding
Paparback
Published Date
June, 2026
Number Of Pages
359
Language
Telugu
Availability
In Stock
About this book

కాళింది

ఏటి కద్దరిని ఓ లంక కన్పిస్తూంటుంది.

రాయిట్ గ్రామాన్ని అనుకుని పారుతూ ఉంటుంది. బ్రహ్మాణీనది. బ్రహ్మాణీకి స్థానిక నామం కాళింది. పల్లె ప్రజలందరూ కాళిందిని 'కాశీ' అని వ్యవహరిస్తుంటారు. ఈ కాళీనదే ఇటీవల అద్దరిని మేట వేసింది. ఇప్పుడు లంకగా ఉన్న ప్రాంతమంతా మునుపు నదీగర్భం. కాళీ, ఇప్పుడు రామ్హట్ గ్రామాన్ని ఓవంతు గ్రసించి, ఊరుని ఒరుసుకుని పారుతోంది. ఇప్పుడి ఇరవై అడుగులు పెళ్ళ విరిగి పడిందంటే చాలు - గ్రామం యావత్తూ ఏటి పాలవుతుంది.

ఈ క్రొత్తగా యేర్పడిన లంక గురించే తగవులు బయల్దేరాయి. రాన్హాట్ చాలా పురాతన గ్రామం. ఇక్కడి పూర్వపు జమీందారులైన రాయ్ వంశీయులందరూ

చిందర వందరగా విడిపోయారు. ఇలా విడిపోయిన రాయ్ వంశానికి చెందిన దాయాదులందరూ ఆ లంకమీద తమ హక్కుని నిరూపించుకోటానికి ఓచేత కర్రలూ బరిసెలూ, మరొకచేత దస్తావేజులూ పత్రాలూ పట్టుకుని ముందుకి ఉరుకుతున్నారు. వీరిలో ఇప్పుడు ఇద్దరు వడ్డీవ్యాపారులూ, కొందరు రైతులూ కూడా తలలు దూర్చారు. ఈ తగవులో తలపట్లు పడుతున్నవారి సంఖ్య ఇప్పుడు నూట పదిహేనుదాకా పెరిగింది. మళ్ళీ వారిలో వారు ఒకరి కొకరు అందరూ విరోధులే. ఆ లంక తమ పరగణాలో ఏర్పడింది కనుక - దాని మీద హక్కు తమకే సంక్రమించాలి. అని జమీందారుల వాదం. 'తమకి తాకట్టులో ఉన్న ప్రాంతంలో ఆ లంక ఏర్పడింది కనుక అది కూడా తమ తాకట్టులో ఉన్నట్టే లెఖ్క' అని వడ్డీవ్యాపారుల వాదం. ఇహపోతే రైతులందరూ - అద్దరిన ఉన్న తమ భూములనన్నిటినీ కాళీతన పొట్టని పెట్టుకుంది కనుక - ఆ నష్టానికి పరిహారంగా ఆ లంకమీద హక్కు తమకే చెందేట్లు చెయ్యటం న్యాయమని వాదిస్తున్నారు.

రాయ్ వంశీయుల్లో ప్రస్తుతం ఉన్న భాగస్థులు నూట అయిదుగురు. ఈ తగవుతో సంబంధం ఉన్న తక్కిన జమీందారు వర్గీయులందరి పేర్లు వ్రాయాలంటే మూడు పుటలు నిండుతాయి.... వీరిలో నూట యిద్దరు కలిశారు. తక్కిన మూడు....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?