Logili Books

History

Karuvu- Vyavasaya Sambandhalu

By K Balagopal

₹150
Out of Stock
Out of Stock
Book Details
Title
Karuvu- Vyavasaya Sambandhalu
Author
Publisher
Manava Hakkula Vedhika Prachurana
ISBN
MANIMN0451
Binding
Paperback
Published Date
2018
Number Of Pages
195
Language
Telugu
Availability
Out of Stock
About this book

             రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి వ్యాపార పంటలు పండించి వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలని కోరుకునే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ మొక్కటే కాదు. 

             పురుగుల మందు కంపెనీల వాళ్ళు, ఎరువుల కంపెనీల వాళ్ళు కూడ అదే కోరుకుంటారు. హైబ్రిడ్ విత్తనాల తయారీదార్లు కోరుకుంటారు. వీటి హోల్ సేల్ డీలర్లు, రిటైల్ అమ్మకందార్లు, కమిషన్ ఏజెంట్లు కూడ కోరుకుంటారు. బోర్ వెల్ కంపెనీల వాళ్ళు, రిగ్గులు తయారు చేసేవాళ్ళు, కరెంటు మోటార్లు, పైపులు తయారు చేసేవాళ్ళు కూడా కోరుకుంటారు. ఉత్పత్తి పెరుగుదల రేటు నాగరికత పురోగమనాన్ని సూచిస్తుందని నమ్మే సామాజిక శాస్త్ర వేత్తలు సైతం కోరుకుంటారు. మార్కెట్ వర్ధిల్లితే అందరూ వర్ధిల్లుతారని నమ్మే ఆర్థిక శాస్త్ర వేత్తలూ, ప్రపంచ బ్యాంకు పెద్దలూ కోరుకుంటారు. మండలానికొక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి విద్యార్థులు కోసం ఎదురుచూస్తున్న విద్యావేత్తలూ కోరుకుంటారు. కడుపునొప్పి అంటే చాలు అపెండి సెక్టమీ నుంచి హిస్టరెక్టమీ దాకా ఏదైనా చేసేయడానికి రెడీగా తాలూకా కేంద్రాలలో సహితం కత్తులు నూరుకొని రెడీగా ఉన్న వైద్య నిపుణులూ కోరుకుంటారు. అర్బన్ మార్కెట్ తో సంతృప్తి చెందక గ్రామాల వైపు ఆశగా చూస్తున్న టి. వి. కంపెనీల వాళ్ళు, ద్విచక్ర వాహన తయారీదార్లు మొదలయిన వారంతా కోరుకుంటారు. 

          పెట్టుబడులు పెరుగుతున్న వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో చిక్కుకున్న రైతులు విజయవంతంగా బయటపడితే వీళ్ళంతా వర్ధిల్లుతారు. అపజయం పాలయితే రైతు మాత్రమే చస్తాడు.

                                                                                                          - కె. బాలగోపాల్ 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?