Logili Books

History

Kavyalokanam

By Nangnamuni

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kavyalokanam
Author
Publisher
Dwimukha Swamyam Prachuranalu Hyd
ISBN
MANIMN4698
Binding
Papar back
Published Date
2023 2nd print
Number Of Pages
106
Language
Telugu
Availability
In Stock
About this book

చేకూరి రామారావు

కొయ్యగుర్రం ఆధునిక మహాకావ్యం

సుమారుగా 1950-60 మధ్యకాలంలో తెలుగుదేశంలో ఆధునిక భావచైతన్యాన్ని ప్రతిబింబించిన ఒకేఒక్క వారపత్రిక 'తెలుగు స్వతంత్ర'. 1954కు పూర్వం మద్రాసు నుంచి, ఆ తరువాత హైదరాబాదు నుంచి వచ్చేది. ఆ పత్రికకు ఒక అలవాటుండేది. వచ్చిన కవితల్లో ఒక పేజీలో సరిపోయే వాటిల్లో మంచిది ఎన్నుకొని విషయసూచిక పక్క పేజీలో అచ్చేసేవారు. ఆ పత్రికలో పడ్డ కవితకి, మరీ ముఖ్యంగా, ఆ పేజీలో పడ్డదానికి తెలుగు పాఠకలోకంలో మంచి గుర్తింపు ఉండేది. నిజాం కాలేజీలో బి.ఏ. చదువుతుండే కొంతమంది మిత్రులం 1956-58 మధ్యకాలం స్వతంత్రలో కవిత్వం చదువుతూ వాటి మంచిచెడ్డల గురించి హాస్టళ్ళలో, వీధుల్లో, పార్కుల్లో, ఇరానీ హోటళ్ళలో టీ తాగుతూ చర్చించుకుంటుండేవాళ్ళం. ఆత్మవిమర్శలు, పరవిమర్శలు, కావ్యవిమర్శల్తో గంటల తరబడి పగళ్ళూ, రాత్రుళ్ళు గడుస్తుండేవి. అలాంటి గంటల్లో ఒకచోట - బహుశా 1957లోనో 1958లోనే అనుకుంటా - ఒక వారం 'స్వతంత్ర'లో విషయసూచిక పక్క పేజీలో అచ్చయిన "సౌందర్యపు స్వగతం" అనే ఖండికను గురించి చర్చించుకుంటున్నాం. కవి పేరు 'సుధ' అని కొటేషన్లో వుంది. ఆ రోజులలోనే నేను 'స్వతంత్ర'లో రాస్తున్న నియోభావగీతాలను అంత మెచ్చుకోని మా 'బక్కోడు' (జె. లక్ష్మీనారాయణ అనే స్నేహితుడు, 'సౌందర్య స్వగతా'నికి ఇంప్రెస్ అయ్యాడు.) 'సుధ' గొంతులో విశిష్టతను గుర్తుపట్టాం......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?