స్వరబ్రహ్మ రాగవిష్ణు
గురుర్దేవో మహదేవన్
నా తొలిపాటకు సరిగమలు దిద్దింది - పెండ్యాలగారు. 'సిరికా ' కొలను చిన్నది' అనే రేడియో నాటిక అది (1969). | సినిమా పాటకు స్వరాలు దిద్దింది మామగారు శ్రీ కె.వి. మహదేవన్. 'ఓ సీతకథ' చిత్రంలో 'భారతనారీ చరితము' అనే మకుటంతో సాగే హరికథ అది (1972).
ఆ సుముహూర్తమెటువంటిదో అది 25 వసంతాల పాటు పుష్పించి ఫలించింది. ఆయనతోను, ఆయన మానసపుత్రుడు | పుగళేందితోను నా అనుబంధాన్ని జీవితంలో మరపురాని మధుర| ఘట్టంగా నిలిపింది. ఆదుర్తి ఆత్రేయ మహదేవన్ కలిసి ఒక స్వర్ణయుగం. అటు తర్వాత విశ్వనాథ్ మహదేవన్ల యుగంలో నా పేరుకు కాస్త చోటు దొరికిందంటే అది నా పూర్వ పుణ్యం.
తెలుగు సినిమాకు సంగీత భిక్ష పెట్టిన మహనీయులలో అగ్రగణ్యుడు 'స్వర బ్రహ్మ' శ్రీ కె.వి. మహదేవన్. సినీ గీతంలో సాహిత్యాన్ని మన్నన చేసి మర్యాద నిలిపిన సంగీత దర్శకుడు ఆయన. తెలుగుతనానికి, తెలుగు గాన సంప్రదాయానికి ప్రతీక మహదేవన్ పాట. ఆయన దగ్గర ట్యూన్లు ఉండేవి కావు. రాసిన పాటను బట్టి ట్యూన్ ఏర్పడుతుందని ఆయన సిద్ధాంతం. ఆయన కట్టిన బాణీలన్నీ 'స్టాకు' లోంచి తీసినవి కావు. ప్రతి ట్యూనూ రాసిన పాటను బట్టి పుట్టినదే..............