• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kulaganana Samajika Nyayam

Kulaganana Samajika Nyayam By Karli Srinivasulu , Nellore Narasimha Rao

₹ 150

పరిణామ క్రమంలో కులవ్యవస్థ

----- నెల్లూరు నరసింహారావు

భారత దేశంలో కులవ్యవస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. వరుస క్రమంలో ఉద్భవించిన వివిధ సామాజిక నిర్మాణాలలో కులం పరిణామం చెందిన తీరును చూచినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. 'శ్రమ ప్రక్రియ' రూపంలో సమాజంలోని ఉత్పత్తిదారులు 'మిగులు'ను సృష్టించటంవల్ల ఒక సామాజిక నిర్మాణం పుడుతుంది. ఈ దశ రాకముందే కులం వంటి సామాజిక వ్యవస్థ ఏర్పడటం దుస్సాధ్యం'. ఋగ్వేదంలోని పురుషసూక్తంలో పేర్కొనబడిన నాలుగు వర్ణాలకు సంబంధించిన మొదటి ప్రస్తావనలో కులాల కంటే సామాజిక తరగతుల వర్ణనే ఎక్కువగా ఉంది. వేద కాలంలో వంశపారంపర్య శ్రమ విభజన లేదా మరేదో రకమైన అంతర్వివాహం గురించి ఎటువంటి సూచనా లేదు.

కులాలు అసలు వేద సమాజంలోని వర్ణాల అంతర్గత విభజన నుండి ఉద్భవించలేదని, అవి పూర్తిగా బాహ్య ప్రక్రియ నుండి ఉద్భవించాయని ప్రముఖ చరిత్రకారుడు డిడి కోశాంబి అన్నాడు. ప్రాచీన భారతీయ చరిత్రలో తెగలకు చెందిన అనేక అంశాలు ఏకమై అవి ఒక సాధారణ సమాజంగా రూపుదిద్దుకున్నాయి. ఈ దృగ్విషయం భారతీయ సమాజ విశిష్ట లక్షణమైన కులానికి పునాదిగా ఉందని కోశాంబి విశ్లేషించాడు. ఈ అంతర్దృష్టిని జాతి అనే పదం నిర్ధారిస్తుంది. బుద్ధుడిని...................

  • Title :Kulaganana Samajika Nyayam
  • Author :Karli Srinivasulu , Nellore Narasimha Rao
  • Publisher :Navachetana Publishing House
  • ISBN :MANIMN6398
  • Binding :Paerback
  • Published Date :April, 2025
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock