• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Lepaakshi
₹ 250

లేపాక్షి నవల ఒక నూతన ఒరవడి
 

ఇది ఒక ఐతిహాసిక నవల

-

- - బి ఎస్ రాములు

బీసీ కమిషన్ తొలి చైర్మన్

8331966987

లేపాక్షి నవల ఒక నూతన ఒరవడిలో సాగింది. ఇది ఒక చారిత్రక, కాల్పనిక నవల. ఇది కాల్పనిక నవలైనప్పటికీ అనేక చారిత్రక అంశాలను సంలీనం చేసుకొని సాగిన నిజమైన చారిత్రక నవల. రచయిత సడ్లపల్లె చిదంబరరెడ్డిగారు సుప్రసిద్ధ రచయిత. ఈ నవలలో తన పరిశోధన అంశాలను, అధ్యయనాలను అనేకం జోడించి సమన్వయించడం జరిగింది. జీవితంలో ఎదురైన, అనుభవించిన, గమనించిన అనేక అంశాలను సందర్భానుసారంగా బంగారు హారంలో ముత్యాలు పొదిగినట్లుగా పొదిగారు. అవి ఎంతో విలువైనవి. శాస్త్రీయ ఆలోచనలను, విశ్లేషణలను ఆయా సందర్భాలలో పొందుపరచడం వల్ల యువతరానికి ఎనలేని విషయ పరిజ్ఞానాన్ని అందించారు. ఆసక్తి, పఠనీయత ఏమాత్రం తగ్గకుండా ఒక డిటెక్టివ్ నవలవలె ఉత్కంఠభరితంగా సాగుతుంది ఈ నవల. అందువల్ల కథ సారాంశం చెబితే కథలో బిగువు సడలే అవకాశం ఉంది. కనుక నవలలోని కథాంశాన్ని స్వయంగా పాఠకులే తెలుసుకోవడం అవసరం అని భావిస్తున్నాను.

ఈ నవల ముందుమాటలో రచయిత సడ్లపల్లె చిదంబరరెడ్డిగారు అనేక విషయాలు వివరించారు. ఈ నవల ఎందుకు రాశారో, ఎందుకు రాయాల్సి వచ్చిందో అనేక కోణాల్లో వివరించారు. ఈ నవలలో ఉత్పత్తి కులాల నైపుణ్యాలను, త్యాగాలను, చరిత్ర పొడుగునా సాగిన వారి సంపద సృష్టిని, సంస్కృతిని,................

  • Title :Lepaakshi
  • Author :Sadlapalle Chidambara Reddy
  • Publisher :Tapana Sahitya Vedica Prachuranalu
  • ISBN :MANIMN5801
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :180
  • Language :Telugu
  • Availability :instock