• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Madya Taragati Mandahasam
₹ 500

అంతరం

తిరుపతి యాత్ర చేసుకొని తిరిగి వస్తూ రాజమండ్రిలో దిగాం. అక్కడ మా శంకరానికి పుద్యోగం. శంకరం మా బాబాయి కొడుకు. మధ్యాహ్నం భోజనాలయాక కొంత నిద్ర తీసాం. నాలుగ్గంటలకు తెలివి వచ్చింది. లేచాను. "అలా టవున్లోకి వెళ్లాం!" అన్నా శంకరంతో, "రెస్టు తీసుకోరా! రేపు నేనూ ఆఫీసుకు శలవు పెడతా! వూరంతా మా ఒదినగార్కి కూడా చూపిద్దాం!" అన్నాడు.

నాకు శలవు అయిపోయింది మర్నాడే జాయిన్ అవాలి. ఆ విషయమే చెప్పా. ఒక్కరోజయినా వుండనందుకు శంకరమూ, మా మరదలూ అసంతృప్తిని వ్యక్తం చేసారు. కానీ నేనదేమీ పట్టించుకోలేదు.

మర్నాడు తప్పకుండా వెళ్లాలని చెప్పా కాఫీలు అయాయి. 'తోటికోడల్లిద్దరూ కబుర్లు చెప్పుకొంటూ వుండండని' చెప్పి నేనూ, శంకరమూ టౌనులోకి బయలుదేరాం. అలా తిరిగి తిరిగి ఒక సినీమాహాలు దగ్గగ్గర కొచ్చాం. "ది లాంగెస్టు డే".

ఆడుతోంది.

"ఈ పిక్చరు చూసావా ?" అడిగాడు శంకరం బొమ్మలు వైపు చూస్తూ "లేదన్నా" నేనూ పోస్టర్లను చూస్తూ. "మరోసారి చూద్దాంలే!" అన్నా మొహమాటంగా, "నీ మొహం! రేపు వెళ్లి పోతానంటున్నావ్! అయినా......................