Logili Books

Short Stories

Kalichedu Katha Vipanchi

By Dr Gunji Venkata Ratnam

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kalichedu Katha Vipanchi
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN6914
Binding
Paparback
Published Date
April, 2025
Number Of Pages
196
Language
Telugu
Availability
In Stock
About this book

గ్రామత్రయం కలిచేడు

తూర్పు కనుమల్లో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన (పెనుశిల కోన). ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు ఖండించినప్పుడు ఏర్పడిన పెద్దగాయమో అన్నట్లు రెండుగా చీలిన పర్వతలోయ. జేగురు బండల కాంతులతో మిలమిలా మెరుస్తూ... చుట్టూ దట్టమయిన అడవి.

పర్వత సానువుల్లో ప్రభవించి ప్రవహిస్తున్న కళ్లేరు. ప్రకృతి కాంత... అందాలను ఆరబోసిందా అన్నట్లు మనోహర వాతావరణం. పూర్వకాలంలో ఈ కళ్లేటితీర ప్రాంతాల్లో కణ్వమహర్షి తపస్సు చేశాడనీ... అందుకే దీనికి కణ్వయేరు అని పేరు వచ్చిందనీ... జన వ్యవహారంలో అది కండలేరుగా మారి... నేడు కళ్లేరుగా పిలువబడుతున్నదనీ జనశ్రుతి.

కరుకు దక్షిణంగా ఒక పెద్ద రాతి గుండు (పెనుశిల) దీనిపైన శిల్పించిన ఉగ్ర నరసింహస్వామిమూర్తి. ఈ పెనుశిలపైన వెలసిన నరసింహస్వామే.. మూల విరాట్టు. 3. పెంచల స్వామిగా ఆరాధింపబడుతున్నాడు.

కళ్లేరుకు ఉత్తర దిశలో దూరంగా అమ్మవారి ఆలయం.. ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది.

విష్ణు భక్తుడయిన ప్రహ్లాదుని రక్షించేందుకు శ్రీమహావిష్ణువు ఉగ్ర నరసింహుడిగా ఆవిర్భవించినప్పుడా భయంకరమైన రూపాన్ని చూచి దేవతలు సైతం భయ భ్రాంతులైనారు. భీతిల్లిన శ్రీమహాలక్ష్మి అమ్మవారు, స్వామి ఎదుట నిలువలేక... దూరంగా నిలిచిందట. ఆ అందుకే ఈ క్షేత్రంలో స్వామి ఆలయానికి దూరంగా ప్రత్యేకంగా అమ్మవారి ఆలయం ఆ నిర్మింప బడిందట. ఇలాంటి కథలే ఈ ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నాయి.

పెంచలస్వామి పాద స్పర్శతో పునీతమైన కళ్ళేరు నది, కలిచేడు గ్రామానికి ఉత్తర దిక్కున కిలోమీటరు దూరంలో ప్రవహిస్తుంటుంది. నదీ తీరాన ఉత్తర దిక్కునంతా సిద్ధేశ్వర పర్వత శ్రేణులు, (సిద్ధలయ్య కొండలు) చుట్టూ అడవి..........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?