₹ 100
చాటు పద్యాలను ఏన్నిసార్లు ఎన్ని రకాలుగా తరచి చూసినా ఆ పద్యల్లోని రామణీయకత జీవన వాస్తవికత, లోక పరిశీలనా సారస్యం ప్రతిసారి మనల్ని అబ్బురపరుస్తూ ఉంటుంది. "పద్యాలయం" అనే గ్రూపును ప్రారంభించి తెలుగు పద్యాన్ని నవీన సాంకేతిక వేదికల పై కూడా వెలిగిస్తున్న ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు, ఆ వేదికలో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారి చాటు పద్యాల వ్యాఖ్యానాన్ని అందించినందుకు వారికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
చాటు పద్యాలను సంపదగా భావించి, ఆ పద్యాల సారాన్ని తమదైన దృక్కోణం నుండి సహేతుకoగా వ్యాఖ్యానించి మనకు పరిచితమైన చాటు పద్యాలలో ని పరిచితమైన అందాన్ని, పద్య నిర్మాణంలోని వైశిష్ట్యాన్ని ఈతరానికి అందించాలన్న సత్సంకల్పంతో ఆచార్య అప్పాజోస్యుల వారు అందించిన "మన చాటు పద్య సంపద" ను ప్రచురించే అవకాశం మాకు లభించడం మా సుకృతం.
-ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ.
- Title :Mana ChatuPadya Sampada
- Author :Acharya Appajosyula Satyanarayana
- Publisher :Viveka Service Society
- ISBN :MANIMN0654
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :instock