Logili Books

History

Manava Charitra Ekkada Prarambhamaindi?

By Dr Devaraju Maharaju

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Manava Charitra Ekkada Prarambhamaindi?
Publisher
Vishalandra Publishing House
ISBN
MANIMN6779
Binding
Papar back
Published Date
Dec, 2025
Number Of Pages
99
Language
Telugu
Availability
In Stock
About this book

ముందుమాట
 

మానసిక బానిసత్వానికి చరమగీతం : స్వేచ్ఛాలోచన!

ఎవడికి తోచింది వాడు ఆలోచించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే దాన్ని ఇతరులపై ప్రయోగించే స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. నీ ఆలోచన నీ పక్కవాడికి నీ సమాజానికీ, నీ దేశానికి, మొత్తం ప్రపంచానికి పనికొచ్చేదై ఉన్నప్పుడు దానికి అందరి ఆమోదం లభిస్తుంది. స్వేచ్ఛ అంటే అరాచకత్వం కాదు. అనాగరిక ధోరణీ కాదు. నీ ఇష్టాయిష్టాల్ని ఇతరులపై బలవంతంగా రుద్దడం కాదు. సంయమనంతో సర్వమానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగపడేది. అందువల్ల స్వేచ్ఛాలోచన (FREE THOUGHT) ను మనం ఈ విధంగా నిర్వచించుకోవచ్చు.

యథార్థాల పునాదిపై వైజ్ఞానిక అవగాహనతో, తర్కబద్ధంగా, హేతు సహితంగా మేధోపరమైన ఒక తాత్విక ఆలోచనా ధోరణే స్వేచ్ఛాలోచన!

అయితే ఈ నిర్వచనం ఇలా ఉన్నఫళాన రూపుదిద్దుకోలేదు. అందుకు కొన్నివేల సంవత్సరాలు పట్టింది. అన్ని బంధాల్ని వదిలేసి భగవదన్వేషణలో గడిపినవారు కొందరు, తొలి రోజుల్లో.... 'తమదే స్వేచ్ఛాలోచన' అని అనుకున్నారు. అయితే ఆలోచనలు పదునెక్కినకొద్దీ నిర్వచనం ఇలా మలుపు తిరిగింది. వారి ఆలోచనకే ఎదురు తిరిగింది.

"స్వేచ్ఛాలోచన' ఈ ఆధునిక యుగంలో చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. 'హేతువాదం' అనేది మనకు ముందునుంచీ ఉన్నా, ఈ స్వేచ్ఛాలోచన అనేది దాన్ని కూడా ఇముడ్చుకుని విస్తరించిన అతి పెద్ద విశాలమైన గొడుగు, ఛాందసాన్ని ఖండిస్తూ, మతాల్ని పక్కకు నెట్టేస్తూ, ఎక్కడ దేనితోనూ రాజీపడకుండా ముందుకొచ్చిన ఒక నూతన ఆలోచనా ధోరణి - స్వేచ్ఛాలోచన! ఫ్రీ థాట్- అనే ఈ 'పదం' పదిహేడో శతాబ్దంలో వాడుకలోకొచ్చింది. సంప్రదాయబద్ధమైన మతవిశ్వాసాల్ని ప్రశ్నించడానికి అప్పుడు ఈ.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?