• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Manipur Mantalu

Manipur Mantalu By Juluri Gowri Shankar

₹ 130

దగ్ధమవుతున్న రాజధర్మం...!

గుజరాత్ మతోన్మాద మారణకాండ (2002) అనంతరం టెలివిజన్ చర్చల్లో ఆ ఘోర ఘాతుకం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా బిజెపి ప్రతినిధులు తప్పక ఒక ఎదురు ప్రశ్న వేసేవారు: '1984 సిక్కుల ఊచకోత మాటేమిటి?'. ఈ ఎదురు వాదనకు కాంగ్రెస్ ప్రతినిధులు ఆత్మరక్షణలో పడేవారు. ఇప్పుడు మణిపూర్ ఘటనలపై ప్రశ్నాస్త్రాలకు కూడా బిజెపి అదే విధంగా, అయితే భయగ్రస్తంగా, ప్రతిస్పందిస్తోంది: బెంగాల్ ఎన్నికల్లో మితిమీరిన హింసాకాండ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లలో మహిళలపై అత్యాచారాల విషయమేమిటి?”. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మణిపూర్ విషయమై ఆక్షేపణలు, ఆరోపణలకు ఇదే విధంగా ప్రతిస్పందించారు. ఆ ఈశాన్య భారత రాష్ట్రంలో మానవత ఆర్తనాదం చేస్తున్నప్పటికీ ఆయన ఎంతకూ విన్పించుకోనే లేదు కదా. గత మే 4న మణిపూర్ లోని ఒక గ్రామంలో ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన విడియో వైరల్ అయిన తరువాతనే మోదీ తన మౌనాన్ని వీడారు. ఆ అనాగరిక ఘటనను ఖండిస్తూనే ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలతో దానికి పోలిక పెట్టారు. ఇదేమి వాదన? ప్రధానమంత్రి పదవిలో ఉన్న నాయకుడు సైతం ఇలా మాట్లాడడంలో ఔచిత్యమున్నదా? తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని అంగీకరించాలి. అలా కాకుండా అటువంటి ఘోరాలు మీ పాలనలో జరగలేదా అని ఎదుటి పక్షం వారిని ప్రశ్నించడం సరి కాదు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో మణిపూర్ ప్రభుత్వం క్షమార్హం కాని అలక్ష్యాన్ని కప్పిపుచ్చేందుకే ప్రధానమంత్రిగానీ, ఇతర బిజెపి ప్రతినిధులుకాని అలాంటి వాదన చేస్తున్నారు. అయితే అది రాజకీయంగా లోపభూయిష్ట, నైతికంగా నిరర్థకమైన వాదన.

సరే, ప్రధానమంత్రి ఎత్తి చూపిన ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలలోని ఘటనల వైనాలను చూద్దాం. నిజమే, బెంగాల్లో ఇటీవలి పంచాయత్ ఎన్నికలలో అడ్డూ అదుపులేకుండా హింసాకాండ జరిగింది. దానిని ప్రతీ ఒక్కరూ ఖండించి తీరాలి. మూడు దశాబ్దాలకు పైగా లెఫ్ట్ ఫ్రంట్ పాలనలో జరిగిన హత్యాకాండతో ఇటీవలి అల్లర్లు, అరాచకాలను పోల్చడం ద్వారా ఎన్నికల సమయాలలో హింసాకాండ సాధారణమేనని మమతా బెనర్జీ ప్రభుత్వం సమర్థించుకోవడానికి ప్రయత్నించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్లో సైతం మహిళలపై నేరాలు ఆందోళనకరంగా పెచ్చరిల్లుతున్నాయని 'నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో' గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. అయితే అటువంటి కేసులలో శీఘ్రగతిన చార్జిషీట్స్ దాఖలు చేయడమనేది గణనీయంగా..................

  • Title :Manipur Mantalu
  • Author :Juluri Gowri Shankar
  • Publisher :Adugu Jadala Publications
  • ISBN :MANIMN4655
  • Published Date :Aug, 2023
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock