• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mrunalini Prema Kathalu

Mrunalini Prema Kathalu By Mrunalini

₹ 150

ఇది నా

ప్రేమ సందేశం... మృణాళిని

ఈ కథలు సుఖాంతాలో, దుఃఖాంతాలో కావు. ప్రేమ సంబంధాల్లో ఖచ్చితంగా సుఖాంతాలూ, దుఃఖాంతాలూ ఉంటాయని నేననుకోను. ఎంతో ఆనందంగా ఉండే సంబంధంలోనూ ఏదో అపశృతి ఉండవచ్చు. ఎంతో వేదనతో కూడిన సంబంధంలోనూ ఒక దరహాసం మొలకెత్తవచ్చు.

ప్రేమ విషయంలో తీర్పులు, తీర్మానాలు, తుది నిర్ణయాలు కుదరవు. 'అందులో అన్నీ సాపేక్షమే. ప్రేమలో అనివార్యంగా కనిపించేది సంక్లిష్టత. ఆ సంక్లిష్టతల్ని స్పృశించడానికి ఈ కథలు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ఎవరికైనా ఇందులో ఏదో తమ జీవితాన్ని పోలివుంది అని అనిపిస్తే, మరీ 'మంచిది. దానికి పూచీ మాత్రం నాది కాదు. |

ఈ ప్రేమకథల్లో ఒళ్లు పులకరింపజేసే సంఘటనలు ఉండవు. అద్భుత మైన ప్రేమ ప్రకటనలూ, విహ్వలత కలిగించే సన్నివేశాలు ఉండవు. ప్రేమ గుడిదీ, చెవిటిదీ కాకూడదనీ, దాని వెనక ఉద్వేగం ఉన్నంత మాత్రాన, ఆలోచన లేకుండా ఉండకూడదని చెప్పే ప్రయత్నమిది. |

మోహావేశం వేరు. ప్రేమ వేరు. మొదటిది తాత్కాలికం. రెండోది ఉన్నంతలో శాశ్వతం.

  • Title :Mrunalini Prema Kathalu
  • Author :Mrunalini
  • Publisher :Analpa prachurana
  • ISBN :MANIMN3565
  • Binding :Paerback
  • Published Date :2022
  • Number Of Pages :122
  • Language :Telugu
  • Availability :instock