Logili Books

Novels

Naa Peru Vivek

By Myna Vishwakarma

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Naa Peru Vivek
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN6870
Binding
Paerback
Published Date
Feb, 2026
Number Of Pages
376
Language
Telugu
Availability
In Stock
About this book

నా పేరు వివేక్

“బాస్! పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. రష్యన్ గవర్నమెంట్ ఇక మనల్ని విడిచిపెట్టకపోవచ్చు.” గన్ బ్యాక్ పాకెట్లో పెట్టుకుని ఆయాసంతో అన్నాడు విష్ణు.

'బాస్ ఏంట్రా? ఇక్కడ మనమిద్దరమే ఉన్నాం.' అనాలనుకున్నాడు కానీ అతని నోట్లో నుండి మాటలు రాలేదు.

అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాడతను. దాదాపు రెండు వందల కిలోమీటర్లు రష్యన్ రిజర్వ్ ఫోర్స్ తమను తరుముకుంటూ వచ్చారు.

ఈ టెన్షన్తో పాటుగా దట్టంగా కురుస్తున్న మంచు.. ముందు ఏముందో అర్థం కావడం లేదు. వాళ్లు నడుపుతున్న 'గాజ్' (రష్యన్ కార్ బ్రాండ్) కార్ ఆ మంచు మూలంగా మరో అంగుళం కూడా ముందుకు వెళ్ళదు.

విష్ణు పలుకుతున్న ప్రతి మాటని మౌనంగా వింటూనే ఉన్నాడు వివేక్.. రష్యన్ అండర్ వరల్డ్ ముద్దుగా పిలుచుకునే 'ఆంత్రియస్'.

ముఖ్యంగా రష్యాలో తిరుగులేని శక్తులుగా ఉండే అల్బేనియన్ గ్యాంగ్స్టర్స్ అతన్నలా పిలుస్తారు. ఆ పదానికి అర్థం 'తిరుగులేని యోధుడ’ని.

అతని శరీరంలో అప్పటికే ఎనిమిది బుల్లెట్లు దిగిపోయాయి, శరీరంలో ఏ అవయవం పనిచేసేటట్లు లేదు కానీ అతని మెదడు మాత్రం సూపర్ కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది. ఆ మెదడే అతన్ని రష్యన్ అండర్ వరల్డ్ లో తిరుగులేని వ్యక్తిగా నిలబెట్టింది.

నెమ్మదిగా సీట్లో వెనక్కి వాలాడు వివేక్.

ప్రాణం పోయేముందు ప్రతి మనిషికి తన జీవితమంతా సినిమా కథలా గుర్తుకొస్తుంది అంటారు. బహుశా తనిప్పుడు అదే స్థితిలో ఉన్నాడేమో!...............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?