ప్రేమ రాయబారి ప్రేమాంతరంగం
ప్రేమ
దేన్ని ఇష్టపడుతుందో!
దేన్ని ప్రేమిస్తుందో!
రూపాన్నో!
లక్షణాల్లో
శారీరక ఆకర్షణనో!
శోధించడం కోసం మధించడం కోసం తరాల నుండి ప్రయత్నం సాగుతూనే ఉంది. ప్రేమ రెండక్షరాలే, లోతు అనంతం. అంతం కోసం అన్వేషిస్తూ సాగిన వారందరూ అంతుపట్టక నట్టనడుమ ఆగిపోయారు. రాజ్ కపూర్ తన అన్వేషణనంతా తాను అర్థంచేసుకున్న క్రమాన్ని సెల్యులాయిడ్పై పలు పార్శ్వాలుగా చిత్రించాడు. గుండెల్ని బిగపట్టుకొని, తపించి, ఏడ్చి, ఇంకిన కన్నీళ్ళపై జాలి కురిపించి చివర్కి తానే ఒక కన్నీటిబొట్టుగా నటించాడు. దక్కినట్లే దొరక్కుండా దాటిపోయిన ప్రేమల్ని విశ్లేషిస్తూపోయారు. చార్లీచాప్లిన్ రోధించేవాడు.
"ప్రేమంటే ఏమిటి? చిన్న సంపుటిలో బి.యస్. రాములు గారు ప్రేమను నిర్వచించే ప్రయత్నం చేసారు. ప్రేమంటే రెండు హృదయాల కలయిక. ప్రేమంటే మానవీయ సంబంధాల అల్లిక. ప్రేమంటే ఆత్మీయత. నీవూ నేనూ సన్నిహితం కావడం ప్రేమ. నీ కష్టాల్ని నావిగా భావించి స్పందించడం ప్రేమ. నీ స్వేచ్ఛను, సమానత్వాన్ని గౌరవించడం ప్రేమ. నీకూ నాకూ మధ్య పరస్పర విశ్వాసం ప్రేమ. పరస్పర నిరంతర మానవీయ సంబంధం ప్రేమ. ప్రేమంటే శరీరానికి, హృదయానికి గల సంబంధం" ఆయన రాసిన ఈ మాటల్ని అందరూ ఏదో ఒక సందర్భంలో నిర్వచించుకోవల్సిన పరిస్థితిని అనుభవించే ఉంటారు. జాన్ హైడ్ కనుమూరి కూడా.....................................