• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Just A House Wife

Just A House Wife By Kavita Kandurthi

₹ 125

కవిత్వావరణంలో కవితని చూస్తూ...

ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుల వేదిక మీదకి ఆహ్వానించిన అతిథులకు ఆపిల్ బుగ్గలతో ముద్దులు మూటగట్టేలా చలాకీగా పళ్ళు తీసుకొచ్చి ఇస్తూ తిరుగుతున్న చిన్ని పా

"అస్తిత్వాన్ని దహిస్తోన్న దారిలో కాసిన్ని మెత్తటి పూలను పరుచుకోనీ” అంటూ ఈనాడు ఇలా అస్తిత్వ ఆలాపనను కవిత్వీకరించినది!

నాన్న చేయిపట్టుకుని ఆదివారం పూట వచ్చి ఇల్లంతా గలగలల మాటల్ని ప్రవహింపచేసిన పిల్లేనా -

"ఓ ఆడపిల్ల లాగే భారాన్నంతా మోస్తూ మౌనంగా మారి/ సంద్రంలో కలిసిపోగలవా" అంటూ ఆదర్శాల ఒరవడిని నేర్చిన గోదావరిలా ప్రవహిస్తోంది!

ఇంట్లో వచ్చిన దగ్గర నుండి ప్రతీ బొమ్మని ఆసక్తిగా చూడటమే కాకుండా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణ పుస్తకాలకి చిత్రాలు వేస్తూ, ఇన్విటేషనుకు అక్షరాలు చెక్కుతున్న వీర్రాజుగారి పక్కనే నిలబడి ఎగిరెగిరి చూస్తున్న పిల్లేనా - "జాతీయ హస్తకళలతో ఇల్లంతానింపి దేశాన్నే ఇంట్లో పొదిగినంత పొంగిపోతుంది" అంటూ కవిత్వీకరించినది!

లోపలి గదుల్లోకి వచ్చి పల్లవి లెక్కలు చేసుకోటానికి ఇంట్లో గోడకి వేలాడదీసిన బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలు పరుస్తూనో, బొమ్మలేస్తూనో మధ్యలో పాఠాలు చెప్తున్నట్లు అభినయించిన అల్లరి పిల్లేనా "ఆకాశం అంచున ఊయలలూగే చుక్కల కథలన్నీ” ఇలా కవిత్వాక్షరాలుగా కాగితాలు వేదికల్ని నింపినది!

నాన్న చిటికెన వేలు పట్టుకొని ఇంట్లోకి అడుగుపెట్టిన చిన్నారి కవిత ఈనాడు "ఇట్లు నీ కవిత" అంటూ కవిత్వమై ప్రవహిస్తూ-

"నీ అంత ప్రేమించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా" అంటూ, నాన్నకే కాదు, తాతకి కూడా గర్వకారణం అయ్యేందుకు తొలి అడుగు వేసింది...........................

  • Title :Just A House Wife
  • Author :Kavita Kandurthi
  • Publisher :Freeverse Front Publicatons, Hyd
  • ISBN :MANIMN6629
  • Binding :Papar back
  • Published Date :2024
  • Number Of Pages :107
  • Language :Telugu
  • Availability :instock