• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rakshasa Kala

Rakshasa Kala By Sanaka Venkata Sudheer

₹ 200

రాక్షస కళ
 

ప్రపంచాన్ని మీకు దాసోహం చేయించే క్రీడ\
 

కుట్ర కుతంత్రం గురించి వివరణ,


కుట్ర వేరు, కుతంత్రం వేరు.

తంత్రం అంటే ఆలోచన, మంచిదైనా, చెడ్డదైనా ఆలోచన.
కుట్ర అంటే “దురాలోచన, స్వార్థంతో ఏదైనా దేన్నైనా సాధించాలనే దురాలోచన, ఒక ఆలోచన".

మనిషి స్వార్థం కోసం, ఉన్నత స్థానం పొందటం కోసం, వంచనతో చేసే ఆలోచననే ఈ కుట్ర అని నేనంటాను.

వంచనతోనే ఏదైనా పొందగలవు, సొంతం చేస్కోగలవు. వంచించబడే ఏదైనా దూరం చేస్కోగలవు.

"కుట్ర, దురాలోచనలో ముఖ్యమైన భాగం, అంతా వంచన మీదనే

ఆధారపడి ఉంది.

మనిషి, జంతువు, పక్షి ఏ జీవి అయినా మనుగడ కోసం...

రాజు, బికారి, అధికారి, పనివాడు, స్త్రీ పురుషులు మొదలగువారు. ఎవరైనా మనుగడ కోసం వంచించాలి. తప్పక వంచనతో కూడిన విధానం అవలంబించాలి, దురాలోచన చెయ్యాలి.

మనిషి అంతర్గత శక్తిని ప్రకృతి, బాహ్యమైన భౌతిక శక్తిని వికృతి అంటారు.

అంతర్గత శక్తులు బైటవాటిని, బైటనుండి వచ్చే ఇంద్రియ జ్ఞానం అంతర్గతం ప్రకృతిని వంచిస్తూనే వుంటాయి. మీ మనస్సుల్లో నిత్యం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. జాలి, దయ, కరుణ, ప్రేమ, ఒక ప్రక్క అశాంతి, కాఠిన్యం, దురాశ ఇలాంటి భావాలు ఒక ప్రక్క సంఘర్షిస్తూనే ఉంటాయి. విరుద్ధ భావాలు కలిగిన ప్రకృతి, వికృతుల మధ్య సంఘర్షణ ఇది. స్మృతులుగా మనస్సు వేసే ముద్రల్లో ఈ కుట్ర కుతంత్రం ఆధారంగానే జరుగుతాయి.

కుట్ర, దురాలోచనకి సంబంధించిన వివరణలోకి వెళ్తే మనిషికి ప్రకృతి ఇచ్చే వెలుగు చాలలేదు. వెలుతురు కోసం నిప్పు, తర్వాత విద్యుత్ కనుగొన్నాడు. ఇది మంచి ఆలోచన ప్రకృతిపరంగా ప్రకృతిని ధిక్కరించి కనుగొన్న వెలుతురు మనిషికి 'అవసరం' అనే దురాలోచన నుండే పుట్టింది..............

  • Title :Rakshasa Kala
  • Author :Sanaka Venkata Sudheer
  • Publisher :Sanaka Venkata Sudheer
  • ISBN :MANIMN5254
  • Binding :Papar back
  • Published Date :March, 2024
  • Number Of Pages :176
  • Language :Telugu
  • Availability :instock