Logili Books

Novels

Rudranagu By Lalladevi

By Lalladevi

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Rudranagu By Lalladevi
Author
Publisher
Classic Books
ISBN
MANIMN7186
Binding
Paparback
Published Date
Sep, 2026
Number Of Pages
183
Language
Telugu
Availability
In Stock
About this book

రుద్రనాగు

పాలు తాగిపడుకొన్న పాములా, నిండుగా, కన్నుల పండువుగా గుండెలు సందడించేలా వుంది నాగులకోన! దండతాడిత భుజంగంలా ఉదయభానుడు బుసలు కొడుతున్నట్టు తూరుపుకొండల్లోంచి పైపైకి దూసుకువస్తున్నాడు. పాము కుబుసంలా ప్రకృతి కన్నియ మసకకాంతులలోంచి మిలమిల మెరుస్తోంది. చరచరసాగే సర్పంలా మట్టిరోడ్డు దూరదూరానికి కదులుతున్నట్టుంది. పుట్టలోంచి పైకివచ్చిన పాముపడగలా ద్యోతక మవుతోంది ఆ గుడి వుపరితలం. గోపుర శిఖరాన రెక్కలార్చుతూన్న రెండుపిట్టలు - మిలమిలలాడే నాళం కళ్ళలా మెరుపులీను తున్నాయి. గుడి చుట్టూ ఏపుగా, దట్టంగా ఆవహించిన చెట్టు తెల్లగా విరగబూసిన చందం... పాముకాటుకు కక్కిన నురగ ఎల్లెడలా వ్యాపించినట్టుగా వుంది గోధుమ వర్ణంలో గుడిగోడ కోడెనాగు బడలికతో సేద తీరుతున్నట్లగా వుంది.... శ్వేతసర్పం పై నించి క్రిందికి జారుతున్నట్టుగా దూరాన కొండమీంచి కోనలోకి జాలువారుతోంది జలపాతం! కిందపడుతున్న జలపాతం చప్పుడు - ఆడమగ పాములు సరసమాడుతున్నప్పటి నవ్వడిని స్ఫురింప చేస్తున్నది. పసిరిక పాముల రాజ్యంలా పచ్చిక బయలు హొయలు వోలక బోస్తున్నది.

సమీప గ్రామం నాగులకోనలో కలకలం చెలరేగింది - నాగస్వర వాయిద్య ఘోష నిస్తబ్దతను బద్దలు చేస్తూ - వుత్తేజాన్ని కల్గిస్తోంది. ఇళ్ళలోంచి జనం పుట్టలోంచి జరజరమంటూ వస్తున్న పాముల్లా నాగస్వర వాయిద్యఘోష దిశగా రాసాగారు. చిన్న పాములు, పెద్దపాములు నల్లపాములు, ఎర్రపాములు రకరకాల సర్పాల్లా.... ఆడా మగా చిన్నా పెద్దా అంతా ఒక్కుమ్మడిగా ఆ దిక్కుకు కదిలారు.

పదిహేను, ఇరవై నిమషాల్లో ఊరు వూరంతా ఊరి బయటికి మొగలి పొదల దగ్గరకు కదిలివచ్చింది. మత్తుకు, విపత్తుకు కేంద్రమైన మొగలి పొదల్లోంచి గుప్పుగుప్పున సువాసనలు విడుదలవుతున్నాయి. జేరిన జనం శివమెత్తిన నాగుల్లా చిందులు వేస్తున్నారు. నాసికా పుటాల్ని విప్పి, బలంగా గాలిపీలుస్తూ గుండెల్ని నింపుకుంటున్నారు. నేల పరచిన కొండబండల గుండెలపై సందడి చేస్తున్నారు. అందలమెక్కినట్టు ఆనందిస్తు...........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?