₹ 80
బాధ్యతగల కవులు , రచయితలు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు , అధికారులు సమాజంలోని అన్ని రంగాల వారు పూనుకుని వారివారి కోణంలోంచి మనిషి మనుగడకు దోహదం చేయాల్సి ఉంది. దృక్పధాలు వేరైనందు వల్ల ఏర్పడే పలుచని పోరాలేవైనా ఉంటె, వాటిని విస్మరించి , ఈ విషయంలో అందరు ఏకం కావాల్సిన అవసరం ఉంది.
విలువల వలువలు కనబడక పోవడం అన్నది ఇప్పుడు మాత్రమే జరుగుతున్న విషయం కాదు. అది భారత కాలం నుండి ఉంది. అంతకు ముందు నుండి కూడా ఉంది. పాంచాలి వలువల్ని విప్పే ప్రయత్నం దుశ్శాసనుడు చేయనే చేశాడు. అందుకు శిక్షకుడా అనుభవించాడు. అందువల్ల ఈ పోరాటం లోగడ జరిగింది. ఇప్పుడు జరుగుతోంది. ఇకముందు జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్దానికి అంతం లేదు. కష్టసాధ్యమైన చెడు పై మంచికి గెలుపు ఖాయం! అనే భావంతోనే ఆశాజీవ అయిన మనిషి బతుకుతున్నాడు.
- Title :Samajika Jeevanamlo Vygnyanika Spruha
- Author :Thirumala Ramachandra
- Publisher :Navachetana Publishing House
- ISBN :MANIMN2086
- Binding :Paerback
- Published Date :2019
- Number Of Pages :103
- Language :Telugu
- Availability :instock