Logili Books

Novels

Samara Kethanam

By Bondada Shantiraja

₹225
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Samara Kethanam
Publisher
Classic Books
ISBN
MANIMN7140
Binding
Paparback
Published Date
Sep, 2026
Number Of Pages
223
Language
Telugu
Availability
In Stock
About this book

సమరకేతనం

మహేంద్రగిరి రాజ్యం సంపదల నిలయం. సుఖ సంతోషాలకు ఆవాసం. చుట్టుపక్కల రాజ్యాల ప్రజలు మహేంద్రగిరి గొప్పతనం గురించి ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటారు. దానికి ముఖ్య కారణం - ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్న అమరపాలుడు. ఆ రాజ్య ప్రజల దృష్టిలో ఆయన దైవసమానుడు. పొరుగు రాజ్యాలకు ఆదర్శప్రాయుడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న అమర పాలునికి పుత్ర సంతానం లేదు. అమరపాలుని సతీమణి కమలాదేవి మహాసాధ్వి. ఆ దంపతులు చెయ్యని పూజలు లేవు, కొలవని దేవతలు లేరు.

ఎట్టకేలకు ఆ దంపతులకు లేక లేక పుట్టింది, ముద్దులు మూటగట్టే ఒక ఆడపిల్ల. వారి సంతోషానికి అవధులు లేకపోయాయి. రాజ్యమంతటా ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

రాజదంపతులు తమ కుమార్తెకు మధుమాల అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచారు. లేకలేక పుట్టిన ఆ బిడ్డను క్షణం విడిచి ఉండలేదు. మధుమాలను పరుల కంట పడనివ్వలేదు. కోటలోనే పెరిగిన ఆమెకు బయటి ప్రపంచం అంతగా తెలియదు. విద్యాబుద్ధులు కూడ కోటలోనే నేర్పించారు. కాస్తో కూస్తో యుద్ధవిద్యల్లో ముఖ్యమైన ఖడ్గవిద్య తెలుసు. చాలా అరుదుగా ఎప్పుడైనా సమీప ప్రాంతాలు చూడడానికి తల్లిగారి వెంట మేలిముసుగు ధరించి వెళుతుంది. ఆమె వెళ్లడం రావడం కూడ తెలియనంత రహస్యంగా ప్రయాణ ఏర్పాట్లు ఉండేవి.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?