Logili Books

Novels

Adrushya Veerudu

By Bondada Shantiraja

₹225
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Adrushya Veerudu
Publisher
Classic Books
ISBN
MANIMN7141
Binding
Paparback
Published Date
Sep, 2026
Number Of Pages
221
Language
Telugu
Availability
In Stock
About this book

అదృశ్యవీరుడు

వింధ్యారణ్యాన్ని ఆనుకుని వున్న కళింగరాజ్యంలో కొండయ్య, విశాలాక్షి అనే దంపతులుండేవారు. వారికి ఒక్కడే కుమారుడు చిత్రవీరుడు. ఇరవయ్యేళ్ల వయస్సులో మిసమిసలాడుతూ చూపరులను ఇట్టే ఆకర్షించేవాడు. ఎప్పుడూ స్నేహితులతో ఆడుతూ పాడుతూ, యుద్ధవిద్యలు నేర్చుకుని వీరుడు అనిపించుకున్నాడు. “నీ పేరులోనే వుందిరా వీరత్వం!" అని మిత్రులు ప్రశంసించేవారు.

చిత్రవీరుడి తండ్రి కొండయ్యది బొమ్మల వ్యాపారం. అందమైన కొయ్య బొమ్మలు, మట్టిబొమ్మలు తయారుచేసి వాటికి రంగులద్ది నగర వీధుల్లో అమ్మేవాడు. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు బొమ్మలు కొనుక్కునేవారు. తిండికి లోటులేకుండా రోజులు గడిచిపోయేవి. అదే కొండయ్య కుటుంబానికి జీవనాధారం.

ఒకనాడు కొండయ్య మట్టిబొమ్మల తయారీకి బంకమన్ను తొక్కుతూ జారిపడ్డాడు. అతని కాలు బెణికింది. అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయాడు. అలాగని ఊరుకుంటే ఆ పూటకి పస్తు పడుకోవాలి. ఎలాగో ఓపిక తెచ్చుకుని కాలు ఈడుస్తూ బొమ్మల అమ్మకానికి వెళ్లబోయాడు.

అప్పుడే ఇంటికి వచ్చిన చిత్రవీరుడు తన తండ్రి పరిస్థితి గమనించి ఆయన్ని వెళ్లనివ్వకుండా ఆపేశాడు. బొమ్మల అమ్మకానికి అతడు సిద్ధపడ్డాడు. చిన్న తోపుడు బండి మీద బొమ్మలు పెట్టుకుని బయలుదేరాడు. వాళ్లమ్మ విశాలాక్షి అరిటాకులో దిబ్బరొట్టె కట్టి ఇచ్చింది. జాగ్రత్తలు చెప్పి పంపింది.

చిత్రవీరుడు హుషారుగా ముందుకు సాగాడు. బాధ్యతగా బొమ్మల అమ్మకానికి వెళుతున్న కొడుకును చూసి మురిసిపోయిందా తల్లి.

నాలుగు వీధులు దాటి రాజవీధిలోకి ప్రవేశించాడు చిత్రవీరుడు. “బొమ్మలమ్మా బొమ్మలు... చిత్రవిచిత్రమైన బొమ్మలు! కోతి, గుర్రం, ఏనుగు... పులి, మేక, సింహం! పిల్లల్ని, పెద్దల్ని మెప్పించే చిత్రమైన బొమ్మలు! వెల తక్కువ, మన్నిక ఎక్కువ. ఆలసించిన ఆశాభంగం. రండి రండి... రారండి!" అంటూ పాట పాడుతున్నట్టు.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?