Logili Books

Novels

Ame Charitra

By V Raja Rama Mohana Rao

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ame Charitra
Publisher
Vijayavani Printers
ISBN
MANIMN6249
Binding
Papar Back
Published Date
2024
Number Of Pages
127
Language
Telugu
Availability
In Stock
About this book

ఆమె చరిత్ర

వరలక్ష్మి ఒంటరిగా సినిమా హాల్కి వెడుతోంది. ఆరు సినిమాహాళ్లు, లక్షన్నర జనాభా ఉన్న ఊరది. జిల్లాకి ముఖ్యపట్టణం. ఊరు ఎంత పెద్దదో తెలుసుకోవటానికి 'ఎన్ని సినిమాహాళ్లున్నాయి మీ ఊళ్లో' అని అడిగే అలవాటున్న రోజులు.

రైసుమిల్లో, పెద్ద హెూటలో లేదా సినిమా హాలుకో యజమాని అయితే ఆ ఊళ్లో ధనవంతుడికింద లెక్క అటువంటి ఓ సినిమా హాలు ఓనర్ గారి దగ్గరికి వెడుతోంది వరలక్ష్మి. ఎండ చిటచిటలాడుతోంది. 'ఇవాళ ఎలాగైనా ఆయన్ని అడిగేయాలనుకుంది' వరలక్ష్మి పమిటతో చెమటతుడుచుకుంటూ.

సినిమాహాలు కనిపిస్తోంది. రెండు నిమిషాలు నడిస్తే చేరుకుంటుంది. ఆ రోజు కాదు ఇంచుమించు ప్రతిరోజు అలా వస్తుంది. ఎప్పుడో కానీ మానదు. వరలక్ష్మి సినిమా చూట్టానికి కాదు సినిమా హాలికి వెళ్లటం. ఆ సినిమాహాల్ ఓనరు రామయ్యగారికి వరలక్ష్మితో సంబంధం ఉంది. నెలసరి ఆమె ఇంటికి అయ్యే ఖర్చంతా ఆయనే ఇస్తున్నారు. సినిమాహాల్లో కింద నేల, బెంచీ, కుర్చీ క్లాసులు. మొదటి అంతస్థులో రిజర్వ్డ్ క్లాసు, ప్రొజెక్షన్ రూమ్.

దాని పక్కనే స్టోర్ రూమ్, ఆ స్టోర్ ముందే గుమస్తా గోపాల్ సీటు. ఆపై అంతస్థులో ఓనర్ రామయ్యగారి ఆఫీసు. ఆఫీసుని ఆనుకుని విశ్రాంతి గది, బాత్రూమ్ ఉన్నాయి.

వరలక్ష్మి తిన్నగా రామయ్యగారి ఆఫీసుకే వెళ్లింది. ఆయన ఏవో కాయితాలు చూసుకుంటున్నారు. వరలక్ష్మి రాక గమనించి... "ఒక్క అయిదు నిమిషాలు కూర్చో లేదా లోపల గదిలోకి వెళ్లు" అన్నారు. వరలక్ష్మి అక్కడే కూర్చుంది. ఫేస్..............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?