విధ్వంస కాన్పు... మేం ఆరుగురమేనా?
లోపలి అగాథలో సృష్టిని తన్నుకొంటూ... వేలకోట్ల గ్రహణ రాశుల పై వెలితిలో ఉష్ణ అఖాతం
కక్ష్యల ఉల్కా రాశుల్లో ద్రోహ స్థలనం
భూమి తనలోకి తానే కాపాడుకోవడానికి కృంగిపోయిన ముడు తల సర్దుబాట్ల గోళ లో పెను ఉప్పెన
మహా సూర్యుడు ముక్కలై చనిపోయినప్పుడు.. మృత్యువుల అగ్ని దుఃఖాన్ని అడుక్కంటా పోగొట్టుకొంటుంది.
భూ ఉపరి తల నుంచి వేల కిలో మీటర్ల కిందుగా.. మట్టి ఉప్పెనల కట్టుబాటు తెగింది ఉరుములు.. లావా రాశులు సుడులతో పగిలిన చీలిక ల్లోంచి పొగలు- టన్నుల కొద్దీ విరిగిన కాంక్రీటు ముక్కలకి మాంసపు నిప్పులు పెనుకేకలుగా అతుక్కొని.. నడుం విరిగిన పోటు గుండాలు
రక్త మల మూత్ర మాంసాల గుట్టల్లో మస్తిష్కాల ఉత్కళ రాద్ధాంతం సమాధులు ప్రవహిస్తున్న శ్వాసిత ఘోషల్లో... ఉపిరి కొండల పగుళ్ళు అతుక్కోవడానికి ఏం మిగల్లేదు
సృష్టి వికృత నిర్ణయం అర్థమయే లోపలే. భూమికి లోపల్నించీ మొదలైన గుండెపోటు...
భూకంపం...
ఎబార్షన్ బ్లౌజుల్ని భూమి గొంతులోకి నింపి చేయించిన వాంతి..
భూకంపం...
విరుచుకుపడ్డ చావు బొరియల్లో పిడుగుల్ని మోసిన భూమికి గర్భస్రావం జ... బయటపడ్డ పిండాలు తాండవిస్తూ ఆకాశాన్ని మింగే ఉల్కాపాతపు సమాధులై మీదకి ఉరుకుతాయి -.............