₹ 200
లోతైన విషయ పరిజ్ఞానం, సమ్యగ్ దృక్పథంతో కూడిన సూక్ష్మ పరిశీలన, విస్పష్ట వివరణ నైపుణ్యం, విమర్శనాత్మక విశ్లేషణా సామర్థ్యం, ఫలితాంశాల ప్రకటనలో నిజాయితీ కల్గిన నిష్పక్షపాత వైఖరీ విమర్శకుడికి వుండాల్సిన మౌలిక లక్షణాలైతే అవి నిండుగా వున్న సమకాలీన విమర్శకుడు కె. పి. అశోక్ కుమార్. బాధిత సమాజం పట్ల సహానుభూతీ ప్రేమ అతని విమర్శకు అంతస్సుత్రం. పఠనీయత ఆరో ప్రాణం. పుస్తక పరిచయం, గ్రంథ సమీక్ష, విమర్శా వ్యాసం, పరిశోధనాత్మక కథనం - రూపం యేదైనా సమగ్రతని సాధించడానికి అశోక్ కుమార్ చేసే ప్రయత్నం అప్రమేయం.
అశోక్ కుమార్ యింతకు ముందు ప్రచురించిన "కథావలోకనం" వచన సాహిత్య విమర్శలో అతని పరిణతికి దర్పణం పట్టింది. వస్తు శిల్పాల్లో నవీనత, వైవిద్యం వున్న సృజనాత్మక రచనలు అతన్ని ఆకట్టుకొంటాయని ఆ వ్యాస సంపుటి స్పష్టం చేసింది.
- కె. పి. అశోక్ కుమార్
- Title :Telugu Navala Prayoga Vaividhyam
- Author :K P Ashok Kumar
- Publisher :Samrat Publications
- ISBN :MANIMN0650
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :214
- Language :Telugu
- Availability :instock