ఆ సిన్న పిల్లోడిది అయోమయిపు పెపంచం. రొండో మేనమావఁ మిద్దింటికి పక్కన్నే గుడిసిలో అమ్మ, అవ్వల మద్దిన పెరుగుతుండాడు. వాడికి ఏదీ సక్కరంగా
మేనమావఁకి ఎదురు పడాలంటే ఏంటికి బయిం పుడతాదో, ఎదురుబడ్డప్పుడు సూసీ సూడ్నట్టు మావఁ ఏంటికని మొకం తిప్పేస్కుంటాడో, ఏంటికని మావఁ ఒక్కమాట గూడా వాడితో ఎప్పుడూ మాట్లాడడో (వోడి అమ్మతో గూడా ఆయిన ఏంటికి మాట్లాడడో) ఆయిన్ని జూడంగానే వాడు ఏంటికి జడుసుకోని లగిచ్చాడో ఆ పిల్లోడికే ఎప్పుడూ అర్హం గాదు.
ఆడపిలకాయిల్తో జేరి తొక్కుడు బిళ్లా పల్లంచాటా మట్టితో దోసిలు బోసే ఆటా సెక్కబొమ్మకి కోక గట్టే ఆటా ఆడతుంటే మేనమావఁ పెళ్లాం జూసి 'ఆడింగి నా బట్టా' అంటా ఏంటికి ఎగతాళిగా నవ్వతాదో, ఆడపిలకాయిల్తో ఆడేటప్పుడు అమ్మో అవ్వో జూసి నదీపున బాది ఏంటికి ఈడ్సకపోతారో వోడికి అర్తం గాదు. అట్టా ఈడ్సకపొయ్యేటప్పుడు సూసిన ఈదిలో మణుసులు ఏంటికి ఇకిలిస్తుంటారో గూడా పిల్లోడికి అర్తం కానే కాదు.
వొక్కోతూరి రేతిరి అమ్మ పక్కన నిదరబొయ్యి తెల్లారినాక అవ్వ పక్కన మేలుకున్నప్పుడు మటుకు 'నాయిన వొచ్చినాడని వోడికి అర్తం అవాది........................