₹ 100
అందరికీ పూజ చేసుకోవాలి - ఆధ్యాత్మిక మార్గాన నడుచుకోవాలి అని ఉండటం సహజమే - కాని కొంతమంది పూజ అనేటప్పటికి అబ్బో ఆ మంత్రాలు తంత్రాలు మనకు తెలియవు బాబూ - అనుకుంటూ భయపడే వారూ ఉంటారు - కాని అతి తేలికమార్గాన పరమ ప్రశాంతతో ఆనందకరంగా ఆహ్లాదకరంగా పూజచేసుకొనే విధంగా తెలుసుకొని ఆ మార్గాన్నే అవలంబిస్తూ ఉంటే ఎటువంటి వారైన అనుకొన్నవన్నీ సాధించగలరు -
మనమిప్పుడు హనుమ పూజా విధానం (నిత్యా పూజా విధానం) మన గృహాలలో మనంతట మనమే చేసుకొనే విధంగా గురించి తెలుసుకుందాం.
స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించి స్వామి ఎదురుగా కూర్చొని ధూపదీపా లంకరణలను పూర్తి చేసుకొంటాం -
ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు కలగకుండ తాపీగా జరిగి పోవాలసి మనమంతా కోరుకొంటాం గదా - ఇది అతి సహజమైన విషయం - అందుకే విఘ్నాలు కలగకుండగ పని సక్రమంగా నిర్విఘ్నంగా సాగిపోయేలా చూసే అధిపతి వినాయకుడు -
- నాగినేని లీలాప్రసాద్
- Title :Sri Hanumath Charitra
- Author :Nagineni Leelaprasad
- Publisher :Victory Publications
- ISBN :VICTORY109
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :206
- Language :Telugu
- Availability :instock