Logili Books

Devotional and Religion

Sri Kasi Viswanatha Antar Gruha Yatra & Panchakrosi Devayatra

By Chaturvedula Muralimohana Sastri

₹50
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Kasi Viswanatha Antar Gruha Yatra & Panchakrosi Devayatra
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN6769
Binding
Paparback
Published Date
Nov, 2025
Number Of Pages
77
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీకాశీ విశ్వనాథ అంతర గృహయాత్ర

శ్లో॥ విశ్వేశం మాధవం నుండిం దండపాణించ భైరవమ్ |

       వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ |

శ్రీ కాశీ క్షేత్ర పరిక్రమణము అను పంచక్రోశి దేవయాత్రా ప్రదక్షిణ విధి, అంతకుముందు తప్పనిసరిగా నిర్వర్తించవలసిన శ్రీ విశ్వనాథ అంతర్గృహ యాత్రలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ చిన్న పుస్తకంలో తెలియపరచే ప్రయత్నం చేశాను. మొదట శ్రీ విశ్వనాథ అంతర్గృహ యాత్రా విశేషాలను చదవండి! విశ్వనాథ అంతరృహ యాత్ర అంటే ఏమిటి?

ఉత్తరాన వరుణాగంగా నదుల సంగమం నుంచి దక్షిణాన అస్సీ గంగా నదుల సంగమం మధ్య గంగానది ఒడ్డున విస్తరించి ఉన్న వారాణసి నగరాన్ని యాత్రా సౌలభ్యం కోసం, స్థల పరిధుల నిర్దేశం కోసం మూడు ఖండాలుగా విభజించారు. పెద్దలు. శ్రీ విశ్వనాథ స్వర్ణాలయం కేంద్రంగా ఉన్న మధ్యభాగాన్ని విశ్వేశ్వర ఖండమని, దీనికి ఉత్తరాన ఓంకారేశ్వరుడు కేంద్రంగా ఉన్న భాగాన్ని ఓంకార ఖండమని, దక్షిణ భాగంలో కేదారేశ్వర లింగం కేంద్రంగా ఉన్న క్షేత్రాన్ని కేదార ఖండమని పిలుస్తారు. అంతరృహం, అవిముక్తం, వారాణసి, కాశీ అని ఒకదానికొకటి ఎక్కువ పరిధి గల నాలుగు విభాగాలుగా పరిగణించే విధానం గూడ ఉంది. (కవర్ వెనక పేజీలో ఉన్న పటం చూడండి.) కాశీలో మరణించిన ప్రాణులు ఏ విధమైన మోక్షానికి అర్హులో నిర్ణయించడంలో ఈ ఖండాలకు ప్రాముఖ్యత ఉంది. పంచక్రోశి యాత్ర చేసే వారందరూ కొద్ది రోజుల ముందుగానే విశ్వనాథ అంతర్గృహ యాత్ర తప్పనిసరిగా చేయటం ఒక శిష్టాచారం. శ్రీ విశ్వనాథ స్వర్ణాలయం చుట్టూ, నాలుగు దిక్కులా విస్తరించి ఉన్న క్షేత్రంలో కొలువై ఉన్న నిర్దిష్ట దేవీదేవులను ఒక క్రమమైన మార్గంలో దర్శించి పూజించటాన్ని విశ్వనాథ్ అంతర్గృహ యాత్ర అంటారు.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?