స్వీయపరిచయం
పరిచయం
ఇలాంటి ఉన్నతమైన, సాహసోపేతమైన కార్యం తలపెట్టడానికి కావల్సిన యోగ్యత నాకుందా అన్నది సందేహమే. హైస్కూలులో నా చదువు పూర్తయ్యాక నారాయణ గురు ఆశ్రమంలో చేరాలన్న కోరిక బలంగా వుండింది. అయితే అనివార్య కారణాలవల్ల ఆ కోరిక తీరలేదు. అప్పట్నుంచి ఎన్నో దూరతీరాలకు విధి నన్ను తీసుకెళ్ళింది. ఈ ప్రయాణంలో కల్లోల కడలి నుండి నన్ను రక్షించి, నడిపించింది గురు కృపయే. గత నాలుగు దశాబ్దాలలో నా దైనందిన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులున్నా గురువు గారి గురించి చదవకుండా, రాయకుండా, ఆలోచించకుండా ఒక్క రోజూ గడవలేదు. ఎన్నో సంవత్సరాలుగా గురువు గారి గురించి చదువుతూ ఈ పుస్తకం రాస్తూ, తిరగరాస్తూ రోజుల్ని గడిపాను.
శ్రీ నారాయణ గురు జీవితం, తత్వం, ఒక విశాల సముద్రాన్ని తలపిస్తాయి. అలాంటి హద్దుల్లేని జ్ఞాన సముద్ర తీరాలలో ఆడుకునే చిన్న పిల్లాడు ఒక చిన్న గవ్వను ఏరుకున్నట్టు, నేను జ్ఞానాన్ని గ్రహించగలిగానని మాత్రం చెప్పగలను. గురువుగారే తనపై ఒకస్థాయి జ్ఞానాన్ని, అవగాహనను దయతో నాలో కలిగించి ఈ...........................................