• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

V Rajaram Mohanrao Novalalu 1st part

V Rajaram Mohanrao Novalalu 1st part By V Rajaram Mohanrao Novalalu

₹ 275

సాయంత్రానికి వయసు పెరిగి రాత్రవుతోంది. ఇంటి పని చేస్తూనే వున్నా మధ్య మధ్యలో కృష్ణ రాక కోసం ఎదురు చూస్తూనే వుంది సుశీల. పనంతా అయిపోయి ముందు గదిలో ఖాళీగా కూచుని కదులుతున్న రాత్రిని చూస్తుంటే.. ఆత్రుత, అసహనం మరింత పెరిగాయి. టేబుల్ మీది నుంచి పుస్తకం తీసుకుని చదవాలని ప్రయత్నం చేసినా చదువు ముందుకు సాగలేదు. కళ్ళు గుమ్మం వేపే పరిగెడుతున్నాయి.

'ఏమిటో మనిషి.. ఆఫీసవగానే ఇంటికి రమ్మనమని ఎన్ని సార్లు చెప్పినా యింతే!' అనుకుంది లేచి పచార్లు చేస్తూ. ప్రత్యేకించి టైము చూసుకోనక్కర్లేదు. సాయంత్రం ఆరింటి దగ్గర్నించి ప్రతి పావుగంటకి, అరగంటకి టైము చూసుకుంటూనే వుంది. వూరికే టైము గడిచిపోతోందన్న భావన మనసులో కదులుతూనే వుంది.

అవసరం వున్నా లేకపోయినా మనిషి తోడుగా వుంటే ఆ నిండువేరు. అందులో ఒక్కోసారి అసలు వొంటరిగా వుండాలనిపించదు. ఇదివరకైతే పొద్దున్న కృష్ణ వెళ్ళిన దగ్గర్నించి, సాయంత్రం వరకూ ఏం తోచక అలా అనిపించేదని చాలాసార్లు.....................

  • Title :V Rajaram Mohanrao Novalalu 1st part
  • Author :V Rajaram Mohanrao Novalalu
  • Publisher :Aju Publications
  • ISBN :MANIMN5987
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :290
  • Language :Telugu
  • Availability :instock