• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Yemi Cheyali V I Lenin

Yemi Cheyali V I Lenin By V I Lenin

₹ 200

ముందుమాట

ఏం చేయాలి?

'ఏం చేయాలి?' అన్న గ్రంధం లెనిన్ సుప్రసిద్ధ రచన. 1902 లో దీనిని లెనిన్ రాశాడు. ఈ గ్రంధాన్ని రచించి దాదాపు 125 సంవత్సరాలు కావస్తున్నది. ఐనప్పటికీ ఇందులో లెనిన్ కమ్యూనిస్టు ఉద్యమానికి చేసిన దిశానిర్దేశం నేటికాలానికి కూడా పూర్తిగా వర్తిస్తుంది. ప్రత్యేకించి భారతదేశ పరిస్థితుల్లో, మన ఉద్యమం ముందుకు పోడానికి ఇది చాలా తోడ్పడుతుంది.

వర్గ పోరాటాలు సమాజానికి చోదకశక్తిగా ఉంటాయని మార్క్స్ చెప్పాడు. దోపిడీ లేని సోషలిస్టు సమాజం కూడా వర్గ పోరాటం నుండే వస్తుందని, ఆ వర్గ పోరాటానికి నాయకత్వం వహించే వర్గం కార్మికవర్గం అని నిర్ధారించాడు. కార్మికవర్గానికి ఒక రాజకీయ పార్టీ ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ అని తెలియజెప్పాడు.

ఆదిమ సమాజం నుండి వర్గ సమాజాలు పుట్టుకొచ్చాయి. బానిసత్వానికి, ఫ్యూడల్ అణచివేతకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలు జరిగాయి. ఆ వ్యవస్థలు కూలిపోయాయి. ఇప్పుడు ఉన్న పెట్టుబడిదారీ సమాజం వర్గపోరాటాలనుండే పుట్టుకొచ్చింది. ఇంతవరకూ జరిగిన వర్గ పోరాటాలు ఒక తీరుగా ఉంటే, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చి సోషలిజాన్ని నిర్మించడానికి జరగవలసిన వర్గ పోరాటం ఇంకొక తీరుగా ఉంటుంది. ఇంతవరకూ ఒక దోపిడీ సమాజం స్థానంలో మరొక దోపిడీ సమాజం వచ్చింది. ఇప్పుడు దోపిడీ సమాజాల స్థానంలో దోపిడీ లేని సోషలిస్టు సమాజం రావాలి. ఇంతకు పూర్వం జరిగిన విప్లవాలు మైనారిటీ వర్గాల నాయకత్వంలో జరిగాయి. ఇది మెజారిటీగా ఉన్న శ్రమజీవుల నాయకత్వంలో జరగాల్సిన వర్గ పోరాటం.

అంతకు పూర్వం జరిగిన వర్గపోరాటాల్లో కూడా శ్రమజీవులు పాల్గొన్నారు. తమపై సాగుతున్న అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా వారు ఆ పోరాటాల్లో పాల్గొన్నారు. కాని అవి శ్రమజీవులు చైతన్యయుతంగా పాల్గొన్న పోరాటాలు కావు. అప్పటికి ఉనికిలో ఉన్న పాలక వ్యవస్థమీద ఉన్న వ్యతిరేకతతో మాత్రమే వారు ఆ పోరాటాల్లో పాల్గొన్నారు. ఆ పాలక వ్యవస్థ పోతే తమ సమస్యలు తీరిపోతాయని వారు విశ్వసించారు. కాని పాత దోపిడీ వ్యవస్థ స్థానంలో కొత్త దోపిడీ వ్యవస్థ వచ్చిందే తప్ప శ్రమజీవులకు దోపిడీ నుండి విముక్తి కలగలేదు.......................

  • Title :Yemi Cheyali V I Lenin
  • Author :V I Lenin
  • Publisher :Praja Shakthi Book House
  • ISBN :MANIMN6268
  • Binding :Papar Back
  • Published Date :April, 2025
  • Number Of Pages :192
  • Language :Telugu
  • Availability :instock