• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Atmabala Yodhudu Gandhi

Atmabala Yodhudu Gandhi By Ashok Book Center

₹ 200

విప్లవాల పూర్వాపరాలు, వివిధ రూపాలు

అరిస్టాటిల్, ది పాలిటిక్స్ లో విప్లవం అనే దానిని "వ్యవస్థను ఒక నిర్మాణం నుండి వేరొక నిర్మాణానికి మార్చే సమూల మార్పు, ఉన్న నిర్మాణానికి తీసుకొచ్చే సవరణగా” నిర్వచించారు. విప్లవం అనేది వ్యవస్థ నిర్మాణంలో వచ్చేది కావచ్చు లేదా నిర్మాణానికి సంబంధించిన ఏక స్వామ్యం నుండి బహుళ స్వామ్యం లేదా ప్రజాస్వామ్యం లోనికి మారే మార్పు కావచ్చు. విప్లవాలు రావడానికి గల కారణాలు, అవి రాకుండా పాటించాల్సిన మార్గాలను కూడా అరిస్టాటిల్ గొప్పగా విశ్లేషించాడు. విప్లవాలకు సంబంధించి అరిస్టాటిలే ముందుగా వచ్చిన సిసలైన సైద్ధాంతిక అధ్యయనం. మెక్యవెలి రాజ్యానికి అంతర్గతం గానూ, బాహ్యం గానూ వచ్చే ప్రమాదాలను గురించి, వాటిని నయానో, భయానో ఎదుర్కొనే విధానాలను గురించి వాటి నుంచి రాజ్యాన్ని పరిరక్షించుకొనే పద్ధతులను గురించి, విస్తృతంగా రాసినప్పటికీ విప్లవానికి సంబంధించి అతనికి స్పష్టమైన సిద్ధాంతం ఉందా అనేది తెలియరాదు. మిగ్వల్ ఇ వాల్టెర్ లాంటి మేధావులు మైక్యవెలి విప్లవం అనే పదాన్ని సరిగానే నిర్వచించాడని వాదించారు. కాని హన్నా ఆరెంట్ విప్లవాన్ని గురించి తన బహుళ ప్రాచుర్యం పొందిన రచనలో మనం ఎక్కువుగా వెతికే ఇటాలియన్ పునరుజ్జీవనంలో విప్లవం అనే పదమే కనబడదని చెప్పుకొస్తారు. ఇంకా తన వివరణలలో పాలకులను పారద్రోలడానికి సిసిరో వాడిన “ముటాటియో రెరం”, “ముటాజియోనీ డెల్ స్టాటో" పదాలనే మెక్యవెలి వాడతారు. మతాతీత రాజ్య ఆవిష్కరణను దర్శించిన మెక్యవేలి చెప్పిన సూత్రాలు, సూచించిన చర్యలు నైతిక ప్రమాణాలకు దూరంగా ఉంటాయని, రాజకీయాల లోకి వచ్చే వాళ్ళెవరైనా, మంచిగా ఉండకుండా ఉండటం, ఎలాగో నేర్చు కోవాలని చెప్పేవారని హన్నా ఆరెంట్ చెబుతారు (పేజీలు 28,29)........................

  • Title :Atmabala Yodhudu Gandhi
  • Author :Ashok Book Center
  • Publisher :Servodaya Interational Trust
  • ISBN :MANIMN4614
  • Binding :Papar back
  • Published Date :Aug, 2023
  • Number Of Pages :151
  • Language :Telugu
  • Availability :instock